కెసిఆర్ జన్మదినం సందర్భంగా బాల్క సుమన్ రక్తదానం
కరీంనగర్,ఫిబ్రవరి17(జనంసాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దపెల్లి ఎంపీ బాల్కసుమన్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు. రామగుండం నగర మేయర్ కే. లక్ష్మినారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీ రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయన వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ పునర్నిర్మాణానికి పాల్పడుతున్నారన్నారు. సిఎం కెసిఆర్‌కు ప్రజలు అండగా నిలిచి మద్దతు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలుప్రకటించి వాటి అమలుకు నిధులు విడుదల చేసి ముందుకు సాగుతున్నారన్నారు. ఇదిలావుంటే సైదాపూర్ మండలకేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సైదాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు స్వామి, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.