కెసిఆర్‌ పట్టుదలతోనే కాకతీయ చరిత్రకు వెలుగు

ఘనంగా కాకతీయ ఉత్సవాలు ప్రారంభం
కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ రాక
ఇక్కడికి రావడం సంతోషంగగా ఉందన్న భంజ్‌దేవ్‌

 

వరంగల్‌,జూలై7(జనంసాక్షి)): సీఎం కేసీఆర్‌ పట్టుదలతో కాకతీయుల చరిత్ర ప్రపంచానికి తెలిసిందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌,వినయ్‌ భాస్కర్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్‌ గౌడ్‌.. వరంగల్‌ అంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల వారసుడిని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. కాకతీయ గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తి అని అన్నారు. కాకతీయుల ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని..గొలుసుకట్టు చెరువులను ఆదర్శంగా మిషన్‌ కాకతీయ చేపట్టామన్నారు. కాకతీయుల ఉత్సవాలు సీఎం ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. తమ వంశస్తుల గడ్డకు రావడం సంతోషంగా ఉందన్నారు కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినా బస్టర్‌ లో మాన్సేవ
కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఓరుగల్లు కోటలో వారం పాటు జరగనున్న కాకతీయ వైభవ సప్తాహ వేడుకలను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. ఈ వేడుకలకు కాకతీయ 22వ తరం వారసులైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన కమల్‌చంద్రకు మంత్రులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి 7 రోజుల పాటు వరంగల్‌, హైదరాబాద్‌ లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం నుంచి ఆలయం వరకు డప్పు, డోలు కళాకారులు, పేరిణి నృత్య కళాకారులు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయ వైభవంపై ఏడురోజుల పాటు నాటకాలు, సదస్సులు, విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ పేర్కొన్నారు. ఈ వేడుకలకు తనను ఆహ్వానించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.