కేంద్రంతో అంశాలవారిగానే సఖ్యత
న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):కేంద్రంతో అంశాల వారీగానే సఖ్యత కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని కూడా అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సమాచారానికి పట్టుబడతామన్నారు. ఈ విషయమై కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలిసి వాస్తవాలను చెబుతామని పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని కోరనున్నట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు విభజనతో పాటు ఉద్యోగుల విభజన తదితర అంశాల్లో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. వివిధ అంశాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ప్రధానంగా హైకోర్టు విభజన విషయంలో ఇప్పటికీ తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణను అబివృద్ది చేసే సత్తా, దక్షత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాత్రమే ఉందని ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాధించిన కెసిఆర్‌కు వెల్లడించిన కొత్త ఆరోపణ చేశారు.తెలంగాణ లో టిడిపి, బిజెపి మిత్రపక్షాలు గా ఉండడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆమె అన్నారు. తెలంగాణలో టిడిపి మద్దతు ను కొనసాగించాలని అనుకుంటే బిజెపి తెలంగాణ ప్రజల మద్దతు కోల్పోతుందని ఆమె అన్నారు. తెలంగాణను సాధించిన కెసిఆర్ లక్ష్యం ఎప్పుడూ తెలంగాణ అబివృద్దిపైనే ఉంటుందని అన్నారు. ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నారని, ఇకముందు కూడా అదే పంథాలో సాగుతారని అన్నారు. ఇక్కడి ఎన్జీవో భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ సమస్యలపై ,హైకోర్టు విభజన అంశంపై తొలిరోజు పార్లమెంటును స్తంబింప చేస్తామని కవిత చెప్పారు.ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని తాము కోరుతున్నామన్నారు. ప్రధాని మోడీ తీరు కొన్ని విషయాలలో తమకు కూడా అసంతృప్తి ఉందని కవిత వ్యాఖ్యానించారు.టీడీపీ-బీజేపీ మిత్ర పక్షం కావడమే సగం సమస్యలకు కారణమని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో హైకోర్టు విభజనపై పోరాటం చేస్తామని కవిత అన్నారు. ఈసారి హైకోర్టు విభజనే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఏపీలో కార్మికుల సమస్యలు ఎర్ర జెండా నేతలకు కనిపించవా? అని ప్రశ్నించారు. ఏపీలోని అంగన్‌వాడీల సమస్యలు వారికి తెలియవా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా కేసీఆర్‌దేని పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనపై ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.