కేంద్రం చేతులెత్తేసింది


` యాసంగి వరి కొననంటోంది
` అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వడంలేదు
` ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరు దారుణం
` వారు దేశభక్తులేనా అన్న అనుమానం వస్తోంది
` రైతులపై మోడీ చూపే ప్రేమఇదేనా
` ధాన్యం విదేశాలకు తరలించకుండా ఆపడం ఎందుకు
` వణికించే చలిలో వెంటపడ్డా అవమానించారు
` కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రులు
` వానాకాలం ధ్యానం తామే కొంటామని ప్రకటన
న్యూఢల్లీి,డిసెంబరు 24(జనంసాక్షి): దేశభక్తిని మాటల్లో చెప్పడం కాదని మాటల్లో చూపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. దేశంలో రైతులు పండిరచిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ మంచి డిమాండ్‌తో అమ్ముడుపోయేలా చేస్తే అది నిజమైన దేశభక్తి అవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆకటి అవసరాలను తీర్చే శక్తి భారత్‌కు ఉందని, ఆ శక్తిని మాటల్లో చెప్పి వదిలేయకుండా కేంద్రం రైతాంగం పండిరచిన పంటలను విదేశాలకు ఎగుమతి చేసి, మంచి మార్కెటింగ్‌ కల్పించాలని కోరారు. తెలంగాణలో రైతులు పండిరచిన ప్రతి గింజ కొనుగోలు చేసి.. ఔదార్యంతో రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు ఢల్లీి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు విూడియాతో మాట్లాడారు. వారం రోజులుగా ఢల్లీిలో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదని నిరంజన్‌ రెడ్డి అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెండిరతలు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందన్నారు. వ్యవసాయ పరిశోధనలు చేసే వ్యవస్థ కేంద్రం పరిధిలో ఉంది. కనీస మద్దతు ధర నిర్ణయం, గోడౌన్స్‌, ఎగుమతులు అన్ని కేంద్రం చేతిలోనే ఉన్నాయని చెప్పారు. రైతులు పండిరచిన పంటలు కేంద్రం కొనుగోలు చేయకుండా చేతులెత్తేయడం అన్యాయ మన్నారు. ప్రతి రంగంలోనూ మేకిన్‌ ఇండియా అంటూ ప్రోత్సాహాలు ఇచ్చే కేంద్రం.. మన దేశ రైతులు పండిరచే పంటల విషయంలో ఎందుకు అగౌరవపరిచేలా వ్యవహరిస్తోందని మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. వంట నూనెలను ప్రతి ఏటా 80 నుంచి 90 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం చెల్లించి విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నారని, ఇది దేశానికి అవమానం కాదా? అని నిలదీశారు. రైతులకు నూనె గింజలు పండిరచే మార్గం చూపించలేరా అన్నారు. నాలుగు కోట్ల జనాభా ఉండే స్పెయిన్‌ పండ్లు, కూరగాయల ఎగుమతుల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉందని, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ ప్రజల నైపుణ్యాన్ని కేంద్రం నీరుగారుస్తందని, శ్రమ శక్తిని అవమానిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 60 శాతం మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి కల్పించే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయొద్దని అన్నారు. పండిరచిన పంటను మొత్తం కొనాలి. రాష్ట్ర మంత్రులు ఎదురు చూస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, మరో రెండ్రోజులు చూసి.. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోతే ఏం చేయాలన్న దానిపై కార్యాచారణపై ముందుకు వస్తామని చెప్పారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రోజులు గడుస్తున్నా క్లారిటీ ఇవ్వడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం ఇబ్బందిపడకూడదని తాము పార్లమెంటులో అన్ని రకాలుగా ఆందోళనలు చేసి, తొమ్మిది రోజుల తర్వాత కూడా కేంద్రంలో చలనం లేకపోవడంతో వాకౌట్‌ చేశామన్నారు. తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందని, దేశంలో పండిన పంట కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, తెలంగాణ భారత్‌లో లేదా? తెలంగాణ రైతులు ఇండియన్స్‌ కాదా? అని నామా నిలదీశారు. రైతులకు అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరని చెప్పారు. ఇప్పటికైనా ఒకటి రెండ్రోజుల్లో వడ్ల కొనుగోలుపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. ఇంత చలిలో కూడా రైతాంగం కోసం తాము కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢల్లీికి వచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు వడ్ల సమస్యపై అన్ని క్లారిటీ ఇచ్చామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు, ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నవే తప్పులని ఆయనకు స్పష్టతనిచ్చామని, ఆయనకు అన్ని క్లారిటీ ఇచ్చామని తెలిపారు. మరోసారి తమకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే పూర్తి స్పష్టతతో వడ్ల కొనుగోలుకు మంత్రి లెటర్‌ ఇస్తారని తమకు నమ్మకం ఉందని ఎర్రబెల్లి చెప్పారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలే లెటర్‌
ఇవ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లు మాట్లాడుతున్న తీరు చూస్తే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి టైమ్‌ ఇవ్వకుండా వాళ్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశ రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లుతెచ్చి వెనక్కి తీసుకున్నారు.క్షమాపణలు కూడా చెప్పారు. మళ్ళీ రైతుల అంశంలో ఎందుకు రాజకీయాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. 60 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా వచ్చిన ధాన్యంతో ఇండియా గేట్‌ వద్ద కూర్చుంటామని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు తిరుగు పయనమైన మంత్రుల బృందం
కేంద్రంలో మకాం వేసిన మంత్రుల బృందం తిరుగుప్రయాణం అయ్యింది. కేంద్రం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్రం తప్పుకున్న కారణంగా ఇక తామే ఈ వర్షాకాల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్‌ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్‌ చేస్తే ఆయన పట్టించుకోలేదని, లిఖిత పూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఎఫ్‌సీఐ గోదాంలు నిండిపోయామని.. వాటిని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని పంపించలేదనే కేంద్రం వాదన సరికాదని ఆయన అన్నారు. తెలంగాణలో గోదాంలు నిండిపోవడంతో.. బీదర్‌, జగ్గయ్య పేటలోని గోదాంలను కేటాయించాలని గతంలో ఏడు సార్లు లేఖలు రాశామని వాటిపై కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్రానికి ఇష్టం లేదని అన్నారు. కిషన్‌ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులపై పక్షపాతి ధోరణి తో వ్యవహరించడం సరికాదని గంగుల అన్నారు. ఇప్పటికైనా కేంద్రం మరోసారి ఈ అంశంపై పునారాలోచించుకోవాలని మంత్రి అన్నారు. విూడియా సమావేశంలో ఎర్రబెల్లి, నిరంజన్‌ రెడ్డి, ఎంపి కెకె తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో దాదాపు ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలుచేయకపోతే దిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు వద్ద పార బోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం దిల్లీకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదన్నారు. తెలంగాణలో పండిన ధాన్యంలో 60లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఇండెంట్‌ ఇచ్చారు. రాబోయే 60లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హావిూ ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశాం. రెండ్రోజుల సమయం ఇవ్వాలని అడిగారు. రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేదు. రెసిడెంట్‌ కమిషనర్‌ ద్వారా పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇంకా ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదు. తెలంగాణ రైతుల తరఫున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదు. వానాకాలంలో రైతులు పండిరచిన 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుంది. తెలంగాణలో వానాకాలంలో ఎంత పండితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌లో మాట ఇచ్చారు. విూడియాతో మాట్లాడుతూ… కిషన్‌రెడ్డి హావిూ ఇచ్చారు. అయినా, దానిపై ఇంకా స్పష్టత ఇవ్వట్లేదు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. లిఖితపూర్వక హవిూ ఇస్తూ లేఖ ఇవ్వకపోతే రైతుల వద్ద కొనుగోలు చేసిన 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని దిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తాం. తెలంగాణ రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.