కేంద్రం నుంచి రూ. 80వేల కోట్లను ఇచ్చాం
– ఎక్కడ ఖర్చు చేశారో కేసీఆర్ చెప్పాలి
– కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకానివ్వడం లేదు
– నాలుగేళ్లుగా మోసాల పాలన సాగించారు
– కేసీఆర్‌కు మసీదులపై ఉన్న ప్రేమ.. ఆలయాలపై ఎందుకు లేదు?
– సీఎంలు మాకళ్లకాడ కూర్చోవాలని అక్బరుద్దీన్ అంటున్నాడు
– మాకు అవకాశమివ్వండి అక్బరుద్దీన్ పీచమణుస్తాం
– బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది
– ప్రజలంతా ఆలోచించి.. బీజేపీకి పట్టంకట్టండి
– అదిలాబాద్ సభలో బీజేపీ చీఫ్ అమిత్‌షా
ఆదిలాబాద్, నవంబర్28(జనంసాక్షి) : కేంద్ర నుంచి వచ్చిన రూ. 80 వేల కోట్లకు విడుదలయ్యాయని, అవి ఎక్కడ ఖర్చుచేశారో కేసీఆర్ లెక్కలు చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు కానివ్వడం లేదని విమర్శించారు. అవి అమలైతే పేదలకు ఎంతో ములు జరుగుతుందని, అలా జరిగితే కేసీఆర్ అధికారానికి ముప్పు ఉంటుందని భావించి అడ్డుకుంటున్నాడని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేట్‌వే లాంటి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాననని, ఇక జీజేపీ ప్రవేశం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసి వీరుడు కుమ్రంభీమ్‌ను స్మరించుకుంటున్నానని తెలిపారు. కుమ్రంభీం లేకపోతే నేడు ఇక్కడకు రావాడానికి తను పాస్‌పోర్ట్ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చారు. గత ఎన్నికల్లో చెప్పిన ఎయిర్ పోర్ట్, సిమెంట్ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్, ప్లెఓవర్ బ్రిడ్జి ఏమైనాయని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ అంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు.
కేంద్ర నుంచి వచ్చిన రూ. 80 వేల కోట్లకు లెక్కలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
కేంద్ర పథకాల అమలేది?
కేసీఆర్ కారణంగా.. మోదీ పథకాలు తెలంగాణలో అమలు కావటం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక్కరికి కూడా ఇళ్లు నిర్మించలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదీవాసీలకు ఆయుశ్మాన్ భారత్ కింద సంత్సరానికి రూ. 5 లక్షలు అందిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల ముందు దళితుణ్ణి సీఎం చేస్తా అన్న కేసీఆర్.. మాట తప్పి తానే పీఠమెక్కాడని విమర్శించారు. విదేశీ చోరబాటుదారులకు మద్దతు పలుకుతున్నారు. రాహుల్ బాబా ఈ విషయంలో అందరికంటే ముందున్నాడంటూ కాంగ్రెస్‌పైన కూడా అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. మైనార్టీ సంతుష్టీకరణ
విషయంలో కేసీఆర్ పోటీ పడ్తున్నారన్నారు. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా మైనార్టిలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ అబద్ధాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టిలకు విద్య, వైద్యం, ఉపాధి, మసీద్ ఇలా అన్ని విషయాల్లో ఊతమంటూ.. ఆలయాల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి అనేది అందరి కోసం ఉండాలిగాని మతాధారంగా కాదంటూ వ్యాఖ్యానించారు.
అవకాశమివ్వడి.. దుష్టశక్తులను పీచమణుస్తాం..
సీఎం ఎవరైనా మాకాళ్ల దగ్గర కూర్చోవాల్సిందే అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. ఇలాంటి దుష్టశక్తుల పీచమణుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావ్ భౌతిక కాయాన్ని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే.. సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెనింగ్ చేస్తామని, పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తామని హావిూ ఇచ్చారు. ఆదిలాబాద్ పత్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిందని, దీంతో దక్షిణ భారతం మొత్తానికి వస్త్రాలందించొచ్చని తెలిపారు.