కేంద్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలి నామా
కూసుమంచి: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కూసుమంచిలో పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పేదవర్గాలపై కనికరం లేకుండా అదనపు భారాన్ని ప్రభుత్వం మోపిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు స్వర్ణకుమారి, మల్లీడు వెంకన్న , రషీద్… తదితరులు పాల్గొన్నారు.