కేంద్రమంత్రినైనా అంబర్‌పేట బిడ్డనే
అంబర్‌పేటకు రాగానే తల్లివద్దకు వచ్చినట్లుంది
నియోజకవర్గ ప్రజలే నాప్రాణం
కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్నాం
మాస్కు పెట్టుకుంటే ఎవరికీ ఏవిూ కాదు
జన ఆశీర్వాద్ సభలో ఉద్వేగానికి లోనైన కిషన్ రెడ్డి
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా శనివారం అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర మంత్రి అయినా తనకు సంతోషం లేదని.. అంబర్ పేటకు దూరమయ్యాననే బాధే ఎక్కువ ఉందని చెబుతూ కంటతడి పెట్టారు. అంబర్‌పేటకు వస్తుంటే చాలా రోజుల తరువాత తల్లి దగ్గరికి బిడ్డ వచ్చినట్లుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని.. అంబర్‌పేట బిడ్డగా అంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తాను ఢల్లీిలో ఉన్నానంటే అందుకు.. అంబర్ పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమని చెప్పారు. దేశానికి రాజైనా అంబర్‌పేటకు తాను బిడ్డనే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద్ సభ శనివారం తన సొంత నియోజకవర్గమైన అంబర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్‌పేట నాకు తల్లిలాంటిది. జీవం పోసింది. పార్టీ.. అంబర్‌పేట నాకు రెండు కళ్లతో సమానమని అన్నారు. దేశంలో ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు 57కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాం. 130 కోట్ల మందికి రెండు డోసులూ చివరి వ్యక్తి వరకు ఉచితంగా టీకా అందిస్తాం. ప్రజల ప్రాణాల్ని కాపాడతాం. పేద ప్రజలు కొవిడ్‌తో ఇబ్బంది పడకూడదని గతేడాది ఏప్రిల్ నుంచి దేశంలోని 80కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. వచ్చే దీపావళి వరకు ఇస్తాం.. ఇంకా అవసరమైతే దాన్ని మరింత కాలం పొడిగిస్తాం‘ అని పేర్కొన్నారు. అందరూ మాస్క్ పెట్టుకోండి. ఏడాదిన్నర నుంచి నేను ఇంట్లో తప్ప మాస్క్ తీయలేదు. గాంధీ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల వార్డుకు తొమ్మిదిసార్లు వెళ్లాను. మాస్క్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నా గనకే కరోనా నన్నేవిూ చేయలేదు. నేను కరోనాని జయించాను. రాష్ట్రంలో ఎన్నో ఆస్పత్రులు తిరిగా.. రోగులను కలిశా.. మందులు తీసుకొచ్చా.. ఆక్సిజన్ తెచ్చా.. ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చా. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. మాస్క్‌లు పెట్టుకోండి. ఎవరికేం కాదు. మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండండని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తేవాలని గతంలో పనిచేస్తే దురదృష్టవశాత్తు కాలేదు. కేంద్ర పర్యాటకమంత్రి అయ్యాక ప్రధాని మోదీతో మాట్లాడాను. ఏ దేశాలైతే ప్రపంచ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించాయో.. ఆ దేశాలను ఒప్పించేలా చేయగలిగాం. మన తెలుగు రాష్టాల్ర నుంచి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విూ అంబర్‌పేట బిడ్డ కూడా కీలక పాత్ర పోషించారు. గోల్కొండ కోటను కూడా అభివృద్ధి చేస్తా. అంబర్‌పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్‌పేటలో గల్లీ గల్లీ తిరిగినట్టు ఇప్పుడూ తిరగాలని నాకు మనసులో ఉంది. కానీ సమయం సహకరించడం లేదు. బాధ్యత పెద్దది. దిల్లీలో ఉండాలి.అందరినీ కలవాలి. అభివృద్ధి కార్యక్రమాలు సవిూక్షించాలి.నన్ను భవిష్యత్తులోనూ విూరంతా ఆశీర్వదించాని కోరుకుంటున్నా అని అన్నారు. ఆయన వెంట బిజెపి నేతలు
పలువురు పాల్గొన్నారు.