కేంద్రానికి జయ ఝలక్
చెన్నయ్: నగదు బదిలీ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు లేఖాస్త్రం సాధించారు. ఫెడరలిజం స్ఫూర్తికి ఈ పథకం పూర్తిగా విరుద్దమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా ప్రభుత్వ సబ్సిడీలు జమకావడం గందరగోళానికి దారితీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేది లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా జయ లేఖతో యూపీఏ పునరాలోచనలో పడింది. జయ లేఖతో తమిళనాట తొలత ఎంపిక చేసిన మూడు జిల్లాలో ఈ పథకం అమలు చేస్తారా లేదా అన్న ఆంశమై సందిగ్ధత నెలకొంది.