కేంద్రానికి తెలంగాణ ఎంపీల షాక్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంపీలు షాక్‌నిచ్చారు. ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై జైపాల్‌రెడ్డి సహా ఏడుగురు ఎంపీలు దిక్కార స్వరాన్ని వినిపించారు. కేంద్ర హోంమంత్రి షిండే, కమల్‌నాథ్‌ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి తెలంగాణ ఎంపీలు హాజరు కాలేదు. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేయమని బుజ్జగించేందుకు ఏర్పాటు చేసిన ఈ భేటికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహా వివేక్‌, మధుయాష్కిడౌడ్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి , రాజగోపాల్‌రెడ్డి పొన్నం ప్రభాకర్‌, మందాజగన్నాథం, రాజయ్యలు గైర్హా జరయ్యారు. తెలంగాణపై తేల్చితేనే తాము పార్లమెంటు సమావేశాలకు హాజరవుతామని చెబుతున్నారు. కేంద్ర మంత్రులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన వారిలో కేంద్ర మంత్రులు బలరాంనాయక్‌, సర్వే సత్యనారాయణ, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, ఎంపీ ఖాన్‌, రాజ్యసభ ఎంపీ వి. హన్మంతరావులు ఉన్నారు.