కేంద్రానికి సుప్రీంలోనూ చుక్కెదురు ఖాయం: హరీష్‌రావత్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు మేరకు తిరిగి బాధ్యతలు చేపట్టిన ఉత్తరాఖండ్ సీఎం హరీష్‌రావత్ రాత్రికి రాత్రి తన కేబినెట్ సహచరులతో సమావేశమై నీటి సమస్యతోపాటు పదకొండు అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం అన్యాయంగా రావత్ సర్కారును భర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించిందని హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. రావత్ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయారని, కాబట్టి మైనారిటీలోపడ్డ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హతలేదని తన వాదనలు వినిపించనుంది. రాష్ట్రపతి పాలన విధించడం తప్పనిసరి అని ధర్మాసనానికి వివరించనుంది.

ఈ విషయంపై రావత్ స్పందిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడం ఖాయమని తెలిపారు. ఈనెల 29న తాను అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో సభ విశ్వాసం పొందుతానని స్పష్టం చేశారు.Uttarakhand-CM-Harish-Rawat