కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి
జహీరాబాద్ సెప్టెంబర్ 24 (జనంసాక్షి)బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షలు నల్లధనాన్ని తెచ్చి వేస్తామని, అన్ని ధరలు తగ్గిస్తామని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా దేశాన్ని పూర్తిగా కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు అప్పజెబుతూ దేశాన్ని ప్రైవేటుపరం చేయిస్తుందని ఈ విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్.మహిపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.మహిపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపై పెద్దఎత్తున భారం వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సలీమ్ ఉద్దీన్ బక్కన్న, తిరుపతి, బీడీ మూర్తి,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.