కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
జనగామ (జనం సాక్షి) అక్టోబర్16: జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ లో డిజిటల్ బ్యాంక్ యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర పర్యాటక శాఖ,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి వర్యులు కిషన్ రెడ్డి కి జనగామ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వంతో రూ.98 కోట్లు మంజూరీ చేయించాలని అంచనా ప్రతిపాదనలతో సహా వినతిని అందించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.అదే విధంగా జనగామ జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు.వారి వెంట మునిసిపల్ చైర్పర్సన్ పోకల జమున,జనగామ జిల్లా నాయకులు ఉన్నారు.