కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మూడవరోజు పర్యటనలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో బిజీబిజీ

 

 

 

 

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 03
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో శనివారం మారుతి ఫంక్షన్ హాల్లో లోక్ సభ ప్రభాస్ యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు ఎండనక వానగా ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే అధికారంలోకి వచ్చాక వరివేస్తే ఊరే అనే మాటలు దేనికి సంకేతం అని విమర్శించారు. ఎలక్షన్ సమయంలో హామీలు 17 వేలకోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రుణమాఫీ మాటనే మర్చిపోయారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు 60 శాతం అయినా అమలు చేశాను కానీ తెలంగాణలో మాత్రం ఐదు శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని అన్నారు. పీఎం కిసాన్ యోజన పథకం తెలంగాణకు 6000 కోట్లు ఇస్తే కేవలం 765 కోట్లు మాత్రమే రైతులకు అందించిందని అన్నారు. యూరియాను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటే ఒక యూరియా బస్తా 20,450 రూపాయలు ఉన్న బస్తా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 270 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఇది అందరికీ తెలియదని దీన్ని రైతులందరూ అర్థం చేసుకోవాలని రాబోయే తరానికి ఒక నిదర్శనం కావాలని కేంద్ర మంత్రి సీతారామన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షురాలు అరుణా తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి,  మురళీధర్ గౌడ్,కిసాన్ మోర్ఛా జుల్లా అధ్యక్షులు పోతాంగల్ కిషన్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్న రాజులు, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, బాన్సువాడ నాయకులు మాల్యాద్రి రెడ్డి, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జువ్వాడి శ్రీకాంత్ ఆయా మండలాల అధ్యక్షులు సాయిబాబా,కార్యదర్శులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.