కేంద్ర విపత్తు సాయం రూ. 4381 కోట్లు

ఆరు రాష్ట్రాలకు మంజూరు

తెలుగు రాష్ట్రాలకు దక్కని సాయం

న్యూఢిల్లీ, నవంబర్‌13 (జనంసాక్షి)  : ఆరు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సహాయం మంజూరు చేసింది. ప్రకృతి విపత్తు సహాయార్ధం హైలెవెల్‌ కమిటీ నిర్ణయం మేరకు ఈ సహాయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ఆరు రాష్ట్రాల్లో అధికమొత్తంలో పశ్చిమ బెంగాల్‌ కు కేంద్ర సాయం అందిందని చెప్పాలి. బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు నిధుల మంజూరు అయ్యాయి. మొత్తం రూ. 4,381.88 కోట్లు ముంజూరు చేసింది చేసిన కేంద్ర హూంశాఖ. 2020లో ‘ఉంపున్‌’, ‘నిసర్గ’ తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడి నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం ఈసాయం ప్రకటించింది. ఉంపున్‌ తుఫాన్‌ సహాయం కింద అత్యధికంగా బెంగాల్‌ రాష్ట్రానికి రూ. 2,707.77 కోట్ల సాయం చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద భీబత్సనికి మాత్రం ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. మొన్ననే ఏపీలో కేంద్ర బందం పరిశీలనకు వచ్చి వెళ్ళింది. ఆ బందం ఇచ్చే నివేదికను బట్టి ఏపీకి నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. తెలంగాణాకు కూడా అప్పుడే నిధులు మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది.