కేజీబీవీ నిర్మాణ, మన ఊరు మనబడి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన వసతులతో అందుబాటులోకి తేవాలి.

.జిల్లా కలెక్టర్
కె. శశాంక.
పెద్దవంగర అక్టోబర్ 09(జనం సాక్షి )
బడులను బలోపేతం చేస్తూ విద్యారంగాన్ని పటిష్టపరుచుటకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుందని తదనుగుణగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు.ఆదివారం
మండలంలోని చిన్నవంగర గ్రామంలోని 3ఎకరాల12 గుంటల్లో నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆదివారం జిల్లా కలెక్టర్  పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన నిర్మాణాలను ప్రణాళికలకు అనుగుణంగా కట్టడాలు చేపట్టాలని, నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ డిసెంబర్లోగా పూర్తి చేసి అందుబాటులోకి  తేవాలని,   విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి దశలో పనులను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
చిట్యాల జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మన ఊరు మన బడి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పనుల్లో ఇంత అలసత్వం వహించరాదన్నారు.
పాఠశాల లేఅవుట్ ను పరిశీలించిన కలెక్టర్ మండలంలో 12 స్కూల్లోనూ మన ఊరు మన బడి పనులను  త్వరిత గతిన పూర్తి చేయాలని, విద్యార్థులు ఇబ్బందులు గురికాకూడదని నిర్దేశించిన పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
 ఈ కార్యక్రమంలో
డి ఈ ఓ అబ్దుల్ హై,
డి సి ఓ కుర్షిద్,
ఈ డబ్ల్యు ఐ డి సి ఈఈ నరేందర్,
ఎంపీపీ.రాజేశ్వరి, జెడ్పిటిసి జ్యోతిర్మయి, ఆర్ డి ఓ ఎల్ రమేష్,
ఎంపీడీఓ.వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ స్థానిక జలగం లక్ష్మి,
ఏ ఈ  అశోక్, జలగం శేఖర్, ఉపేందర్ రెడ్డి ,సంబంధిత అధికారులు  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area