కేజీవ్రాల్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ,నవంబర్‌28  (జనం సాక్షి) : అరవింద్‌ కేజీవ్రాల్‌ నేతత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్‌1/-ఖ9 మహమ్మారి సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య సదుపాయాలపై కన్నా ప్రకటనలపై ఎక్కువ ఖర్చు చేస్తోందని దుయ్యబట్టింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి పవన్‌ ఖేరా శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మార్చి నుంచి హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్నారు. కేజీవ్రాల్‌ ప్రభుత్వం ప్రకటనలపై కావలసినంత ఖర్చు పెట్టగలుగుతోందని, అయితే అంతిమంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల ఢిల్లీ ప్రజలు బాధపడుతుండటం దురదష్టకరమని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బురారీలో ఆసుపత్రి గురించి ప్రకటనలు ఇస్తోందని, ఈ ఆసుపత్రిని షీలా దీక్షిత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రారంభిం చారని చెప్పారు. ఈ ఏడాది వైద్య సదుపాయాలపై ఎక్కువ ఖర్చు చేయవలసి ఉండగా, కేజీవ్రాల్‌ ప్రభుత్వం వైద్య రంగం కోసం కేటాయించిన బడ్జెట్‌లో 25 శాతం మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మొహల్లా క్లినిక్‌ల గురించి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కోవిడ్‌1/-ఖ9 మహమ్మారి సమయంలో ఈ క్లినిక్‌లు ఏమైపోయాయని ప్రశ్నించారు. వీటిలో ఎన్ని క్లినిక్‌లు పని చేస్తున్నాయని నిలదీశారు.