కేజ్రీవాల్‌ వర్సెస్‌ నజీబ్‌జంగ్‌

3
ఢిల్లీ మే16(జనంసాక్షి):

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌ మెంట్‌ కోరారు. ఢిల్లీ రాష్ట్ర తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శకుంతల గ్లామిన్‌ ను నియమించడంపై ఆప్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ సీఎస్‌ కేకే శర్మ వ్యక్తిగత పని విూద అమెరికాకు వెళ్లారు. దాంతో, ఆయన స్థానంలో శకుంతలా గ్లామిన్‌ ను నియమిస్తూ నజీబ్‌ జంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తన సిఫార్సుకు విరుద్ధంగా గ్లామిన్‌ ను సీఎస్‌ గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆమెపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.

అయితే, ఆప్‌ సర్కారు వాదనలను నజీబ్‌ జంగ్‌ ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239 ఎఎ ప్రకారం లెఫ్టినెంట్‌ గవర్నరే ఢిల్లీ సర్వోన్నత అధికారి అన్నారు. సీనియారిటీ, పనితీరు ప్రాతిపదికగా గ్లామిన్‌ ను ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇలా నాటకీయ పరిణామాలు కొనసాగుతుండగానే గ్లామిన్‌ సీఎస్‌ గా బాధ్యతలు చేపట్టారు.