కేటీఆర్ తో ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భేటీ
హైదరాబాద్,జనవరి29(జనంసాక్షి):మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, నటుడు రాజేందప్రసాద్ శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం రాజేందప్రసాద్ విూడియాతో మాట్లాడుతూ.. మా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల గురించి మంత్రితో చర్చించేందుకు వచ్చినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ‘మా’ కు కొత్త భవనం కావాలని మంత్రిని కోరానని, సీనియర్ కళాకారుల సమస్యలపై చర్చించానని చెప్పారు. సమస్యలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.