కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆర్థిక సహాయం అందజేయుత

గరిడేపల్లి, జూలై 24 (జనం సాక్షి):తెరాస  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా  గరిడేపల్లి మండలంలోని  పోనుగొడు గ్రామములో వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిన  తల్లోజు వెంకమ్మకి జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ ద్వారా 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి  గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తువుల పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దార్శనికుడు రాష్ట్రంలో ఐటి రంగానికి వన్నె తెచ్చిన గొప్ప మేధావి కాల్వకుంట్ల తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద్ రెడ్డి,బాల్తూ వెంకన్న, రాంబాబు, నందీపాటి సైదులు, పకిరా, సైదులు, సిబ్బంది సత్యం,హరీష్, రాజు,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.