కేటీఆర్‌ దుబాయ్‌ పర్యటన విజయవంతం

` తెలంగాణలో ‘తబ్రీద్‌’ రూ.1600 కోట్ల పెట్టుబడులు
` రాష్ట్రంలో డిస్టిక్‌ కూలింగ్‌ సిస్టం ఏర్పాటు చేయనున్న ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ
` ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు కూలింగ్‌ మౌలిక వసతుల కల్పన
` ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం
దుబాయ్‌(జనంసాక్షి):ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీడ్‌ తెలంగాణ రాష్ట్రంలో తన భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. తంబీద్‌ సంస్థ వాణిజ్య మరియు ఇతర రంగాల శీతలీకరణ కార్యక్రమాలకు పేరుగాంచింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ (ఆయా పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన శీతలీకరణ మౌలిక వసతుల) నిర్మాణం కోసం దాదాపు 1600 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి ఆయా పారిశ్రామిక పార్కులకు శీతలీకరణ వసతులను అందించనున్నది. సంస్థ హైదరాబాద్‌ ఫార్మసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు ఈ కూలింగ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనున్నది. ఈ మౌలిక వసతుల కల్పన వలన పారిశ్రామిక పార్కులాలకు అవసరమైన కూలింగ్‌ మరియు స్టోరేజ్‌ అవసరాలను తీర్చేందుకు అవకాశం కలుగుతుంది. ఈ మేరకు సంస్థ లక్ష 25 వేల రిఫ్రిజిరేషన్‌ టన్నుల కూలింగ్‌ మౌలిక వసతులను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది. దీని వలన 24 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డ యాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ఈ లక్ష్యం పూర్తయితే ఆసియా ఖండంలోనే జీవించేందుకు, పని చేసేందుకు అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలవబోతున్నది. ఈ సంస్థతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ కూలింగ్‌ సొల్యూషన్స్‌ మౌలిక వసతుల వలన బహుముఖ ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ లక్ష్యాల మేరకు దాదాపు 6800 గిగా వాట్ల కరెంటుతో పాటు 41,600 మెగా లీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది.  దీంతోపాటు ఆరు పాయింట్‌ రెండు మిలియన్‌ టన్నుల కార్బన్‌  డయాక్సైడ్‌ ఉద్గారాలను అరికట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఈ సంస్థతో కలిసి చేపడుతున్న ఈ మౌలిక వసతుల కల్పన వలన ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న బల్క్‌ డ్రగ్‌ తయారీ కేంద్రాలకు స్వచ్ఛమైన హరితమైన పరిష్కారాలు లభించే అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు తబ్రీద్‌ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ వంటి కమర్షియల్‌ డిస్ట్రిక్ట్‌ (నిర్దేశిత వాణిజ్య ప్రాంతాలు) తో పాటు రానున్న ప్రాంతాలలోనూ 2 మెగావాట్ల మేర విద్యుత్‌ డిమాండ్‌ ను తగ్గించేలా కార్బన్‌ డయాక్సైడ్‌ య ఉద్గారాలను తగ్గించేలా సుదీర్ఘకాలం పాటు ఈ కూలింగ్‌ పరిష్కారాలను అందించేలా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో సుదీర్ఘకాలంలో హైదరాబాద్‌ నగరంలో కాలుష్యము మరియు ఉష్ణోగ్రతలు తగ్గి అత్యుత్తమ నగరాలకు కావలసిన అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావాన్ని ఈ సందర్భంగా సంస్థ వ్యక్తం చేసింది. తబ్రీద్‌ సంస్థ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) ఖలీద్‌ అల్‌ మర్జుకి ప్రతినిధి బృందం ఈరోజు మంత్రి కే తారక రామారావు తో దుబాయిలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, హైదరాబాద్‌ ఫార్మసిటీ సీఈవో శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్‌ భవిష్యత్తు కోసం ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.  కార్బన్‌ ఉద్గారాలను తగ్గిస్తూ, ప్రస్తుత మరియు భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు అనుకూలంగా అమలు చేసేందుకు వీలైన డిస్టిక్‌ కూలింగ్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌, తక్కువ విద్యుత్‌ శక్తిని ఉపయోగించుకునే ఞనీనీశ్రీతినిణ పరిష్కారాలను, కూల్‌ రూఫ్‌ పాలసీ వంటి విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి నెట్‌ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు పోతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర మాత్రమే కాకుండా భారత దేశ సస్టైనబుల్‌న్ఫ్ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సంస్థ చైర్మన్‌ ఖాలిద్‌ అబ్దుల్లా అల్‌ ఖుబాసి తెలిపారు. తమ సంస్థకు డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ రంగంలో ఉన్న అపారమైన అనుభవము సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య రహిత ఫార్మసిటికల్‌ క్లస్టర్‌ హైదరాబాద్‌ ఫార్మాసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు అవసరం అయినా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తమ కూలింగ్‌ టెక్నాలజీలను అందిస్తామన్నారు. పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలు కలిగించే కాలుష్యానికి ప్రధాన కారణం అవి వాడే కూలింగ్‌ టెక్నాలజీలు అని వాటి ద్వారానే భారీ ఎత్తున కార్బన్‌ ఉద్గారాలు వెలువడతాయని అయితే ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం మేరకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి కూలింగ్‌ పరిష్కారాలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా నెట్‌ జీరో ఉదారాల విషయంలో తెలంగాణ తన లక్ష్యాన్ని అందుకుంటున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు తమ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాం ఇండియా హెడ్‌  అతుల్‌ బగాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పైన ప్రశంసలు కురిపించారు. ద్వారా అంతర్జాతీయ కూలింగ్‌ ప్లెడ్జ్‌ కార్యక్రమాన్ని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ప్రోగ్రాం చేపట్టిందని ఇందులో భాగంగా ప్రపంచ దేశాలని అత్యుత్తమ కూలింగ్‌ విధానాల ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం మేరకు పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

(దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం కేటీఆర్‌ ప్రయత్నం
` ఇప్పటికే సంవత్సరాలుగా ఖైదీల విడుదల కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి
` తాజాగా దుబాయ్‌ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు..అక్కడి అధికారులతో సమావేశం
దుబాయ్‌(జనంసాక్షి):దుబాయ్‌ లోని అవీర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీఆర్‌ మరోసారి ప్రయత్నిస్తున్నారు. తన దుబాయ్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్టుబడుల పర్యటన కోసం దుబాయ్‌ లో పర్యటించిన కేటీఆర్‌, ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసుని వాదిస్తున్న అరబ్‌ లాయర్‌, దుబాయ్‌ లో భారత కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు, దుబాయ్‌ ప్రభుత్వ అధికారులతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఇందులో పలువురుతూ ప్రత్యేకంగా సమావేశం అయి కేసు పురోగతి విషయాన్ని తెలుసుకున్నారు. ఖైదీల క్షమాభిక్ష కోసం ప్రయత్నం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్‌, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్‌ ,శివరాత్రి హనుమంతులు ఒక కేసులో భాగంగా దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 15 సంవత్సరాలకు పైగా తమ జైలు శిక్ష పూర్తి చేసుకున్నారు. వీరి విడుదల కోసం మంత్రి కేటీఆర్‌ స్వయంగా చొరవ చూపి, సుదీర్ఘకాలంగా  అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ నేరంలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్‌ కు చెందిన బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి మంత్రి కేటీఆర్‌ , దియ్య సొమ్ము (బ్లడ్‌ మనీ) అందించారు. ఆ తర్వాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని దుబాయ్‌ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాలు, నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్‌ ప్రభుత్వం క్షమాభిక్షను ఇప్పటిదాకా ప్రసాదించలేదు. ఆరు నెలల కింద మరోసారి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా దుబాయ్‌ లాయర్‌ కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్‌ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సవిూక్షించారు.ఇప్పటికే బాధ్యత కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహాన్ని షరియా చట్టం ప్రకారం దియ్యా( బ్లడ్‌ మనీ) రూపంలో అందించడం జరిగిందని,  ఆ తర్వాత 2013 లోనే నేపాల్‌ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబాయ్‌ ప్రభుత్వానికి భారత కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం ద్వారా అందించడం జరిగిందన్నారు.  అయితే ఇప్పటిదాకా నిందితులకు ఉపశమనం లభించలేదని మంత్రి కేటీఆర్‌ ఈరోజు జరిగిన పలు సమావేశాలకు సందర్భంగా అటు భారత కాన్సిల్‌ జనరల్‌ కార్యాలయ అధికారులకు, దుబాయ్‌ ప్రభుత్వాధికారులకు తెలియజేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించి జైలు అధికారుల ద్వార మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. తన పర్యటనలో భాగంగా అటు దుబాయ్‌ కాన్సల్‌ జనరల్‌ గా వ్యవహరిస్తున్న రామ్‌ కుమార్‌ తో పాటు, ఈ కేసు వాదిస్తున్న అరబ్‌ లాయర్‌, బాధిత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు, పలువురు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల తో మంత్రి కేటీఆర్‌ ప్రత్యక్షంగా సమావేశమై క్షమాభిక్ష ప్రక్రియ పురోగతి వివరాలు తెల్సుకుని, ఈ అంశంలో సహకారం అందించాలని కోరారు.  తన వ్యక్తిగత స్థాయిలో, అటు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నారై ల క్షమాభిక్ష పిటిషన్‌ దుబాయ్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో, దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ ద్వారా క్షమాభిక్ష ప్రసాదిస్తేనే తెలంగాణ ఎన్నారై ఖైదీలకు ఉపశమనం లభిస్తుందని, ఈ దిశగా ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్‌ తాను కలిసిన పలువురికి  విజ్ఞప్తి చేశారు.  ఈ విషయంలో దుబాయ్‌ కాన్సల్‌ జనరల్‌ కార్యాలయం చొరవ తీసుకోవాలని కాన్సన్‌ జనరల్‌ రామ్‌ కుమార్‌ కు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జరిగిన బిజినెస్‌ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్న పలువురు వ్యాపారవేత్తలతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, మానవతా దృక్పథంతో తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, దుబాయ్‌ ప్రభుత్వంతో ఈ విషయాన్ని స్థానిక చట్టాల మేర చర్చించేందుకు పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌ కు హావిూ ఇచ్చారు.