కేటీపీఎస్ జాతికి అంకితం
– వరంగల్‌కు మంచి రోజులు
– సీఎం కేసీఆర్
వరంగల్,జనవరి 5(జనంసాక్షి): రానున్న రెండేళ్లలో అంటే 2018 నుంచి రాష్ట్ర మంతా 24గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. రైతుల కోసం ఖరీఫ్ పంటకు 9గంటల విద్యుత్ అందిస్తామన్నారు. ఏటా రూ25 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్ట్ ల అభివృద్ధికి ప్రకటిస్తామని హావిూ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మార్చి నుంచి కళ్యాణ లక్ష్మికి అర్హులని ప్రకటించారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు.. నేటి నుంచి రెగ్యులర్ లైన్ మన్లే నని తెలిపారు. 2019 సంవత్సరం నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసుకున్న సంకల్పానికి మరో ముందడుగు పడింది. గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటుచేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్(600 మెగావాట్లు)లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలోగానీ, మొన్నటి ఎన్నికల్లో గానీ వరంగల్ ప్రజలు చూపిన ప్రేమను టీఆర్‌ఎస్ పార్టీ మరచిపోదని సిఎం కెసిఆర్ అన్నారు. ఏం ఇచ్చినా విూ రుణాన్ని తీర్చుకోలేమని తెలిపారు. ఓటుతో ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేసిన వరంగల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తరవాత ఎన్నికల్లోనూ వారు అనేక విధాలుగా అండగా ఉంటూ వస్తున్నారని అన్నారు. వారిచ్చిన ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ హావిూలను అమలు చేస్తున్నామని అన్నారు. వరంగల్ జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో మూడు పంటలు పండించి చూపిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ములుగు, భూపాల్‌పల్లి, పరకాలకు ఉన్న మంచి అవకాశాలేంటంటే చెరువులు అని తెలిపారు. వీటి ద్వారా రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. గణపురం, లక్నవరం, రామప్ప చెరువుల కింద మూడు పంటలు పండించి చూపిస్తామని ధీమాగా ప్రకటించారు. డీజీఎం38తోపాటు కాకాతీయ కెనాల్ కింద ఉండే డిస్టిబ్యూషన్ సిస్టమ్‌ను మెరుగు పరుస్తామన్నారు. కాకతీయ కెనాల్‌ను అన్ని రకాలుగా పునరుద్దరిస్తామన్నారు. చిన్నపాటి లిఫ్టుల ద్వారా ఇది సాధ్యమని తెలిపారు. ఇందు కోసం జనవరిలో నిధులు మంజూరు చేస్తామని ఫిబ్రవరిలో నీటిని సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. వచ్చే సీజన్ నుంచే రైతులకు ఈ అవకాశం కల్పిస్తామన్నారు. కచ్చితంగా కాకతీయ కెనాల్ కింద ఉండే డీబీఎంలను బాగు పరిచి రైతులకు నీళ్లు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నానని వేదికపై నుంచి ప్రకటించారు. ఎంత డబ్బు కావాలన్నా అడగాలని, ఎంత అడిగితే అంత డబ్బు మంజూరు చేస్తామని స్థానికుల కరతాల ధ్వనుల మధ్య సీఎం వెల్లడించారు. భీంఘన్‌పూర్ దగ్గర లిఫ్టు పెడితే చాలా గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి గోదావరి నీటిని తరలిస్తామన్నారు. ప్రతీ సంవత్సరం రూ.25 వేల కోట్లు ఇరిగేషన్‌కు కేటాయిస్తున్నామన్నారు. వీటితో విూ జిల్లాల్లోని చెరువులను నింపుతామన్నారు. సంవత్సరంలో 365 రోజులు నీటితోనే నిండి ఉంటాయని తెలిపారు. దమ్మున్న రైతులు మూడు పంటలు కూడా పండించుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్టాన్ని 2019 నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. పలు విద్యుత్ ప్రాజెక్టులను అనుకున్న సమయానికన్నా ముందే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈమేరకు మంగళవారం కెసిఆర్ వరంగల్ జిల్లా గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కేటీపీపీ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. ఈమేరకు ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి సవిూపంలో నిర్మించిన కేటీపీపీ రెండో దశ ప్రాజెక్టును మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కేటీపీపీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం, పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం… 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దేవాదుల పూర్తయితే ఇప్పుడున్న చెరువులు నిండి మూడు పంటలు పండించుకునే అవకాశం వస్తుందని అన్నారు. లక్నవరం,పాఖాల, రామప్ప ఇలా అన్ని చెరువుఉల నిండి మూడు పంటలకు అవకాశం వస్తుందన్నారు. విూరు ప్రేమతో దీవించి టీఆర్‌ఎస్ యువనేత పసునూరిని గెలిపించినందుకు ధన్యావాదాలు అని తెలిపారు. ఎంత డబ్బు అయినా ఖర్చు చేసి వరగంల్‌లో కాకతీయ డిస్టిబ్యూషన్ సిస్టమ్ పునరుద్దరించాలన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులతోముందుకు సాగుతున్నామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, పోఆరం శ్రీనివాసరెడ్డి,జగదీవ్వర్ రెడ్డి,ఎంపి వినోద్ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. వరంగల్ తీర్పుతో ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతున్నామని అన్నారు. తెలంగాణ వస్తే చీకట్లో మగ్గాల్సిందేనని ఒకాయన కట్టెపెట్టి చూపారని, కానీ తెలంగాణ వస్తే కరెంట్ కోతలు లేకుండా చేశామని అన్నారు. కాగా, కేటీపీపీ రెండో యూనిట్ విద్యుత్ ప్లాంట్ ద్వారా 6 వందల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తొమ్మిది వందల ఎకరాల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.3,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టారు. కాగా, కేటీపీపీ మొదటి యూనిట్‌లో ఇప్పటికే 5 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వీటికి సవిూపంలోని బొగ్గు గనులు, గోదావరి నది నీరు అందుబాటులో ఉండటంతో కేటీపీపీని ఏర్పాటు చేశారు. మొదటి దశ ప్లాంట్‌కు జూన్ 1, 2006లో శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రైతులకు పగటిపూటనే విద్యుత్‌ను అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను చీకటిమయం చేయాలని సీమాంధ్రులు కుట్ర పన్నారని తెలిపారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడుతూ.. సీఎం కేసీఆర్ ఆరు నెలల్లోనే కోతలు లేని కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. 2019 నాటికి దేశంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు.