కేదార్‌నాథ్‌లో యాత్రికులెవరూ చిక్కుకుని లేరు: డ్రెహాడూన్
కలెక్టర్
డెహ్రాడూన్ : కేదార్‌నాథ్ ప్రాంతంలో యాత్రికులెవరూ చిక్కుకుని లేరని డ్రెహాడూన్ కలెక్టర్ పురుషోత్తం చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పరిస్థితిపై ఈటీవీ అయన్ను ఫోన్‌లో సంపద్రించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ యాత్రికులందరినీ కేదార్‌నాథ్ నుంచి 1500 మంది యాత్రికులు ఉన్నారని వారిని అక్కడ నుంచి రుషికేష్ మీదుగా ఢిల్లీ పంపుతామని తెలిపారు. యమునోత్రిలో ఉన్న 2500 మందిలో 50 మంది రాష్ట్రానికి చెందిన వారున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ఢిల్లీలోని ఏపీభవన్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్తున్నారని అన్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతిన్నందున బదరీనాథ్‌లో దాదాపు 7వేల మంది యాత్రికులు ఉన్నారని వెల్లడించారు. కేదార్‌నాథ్ ప్రాంతంలో భారీగా ప్రాణ నష్టం జరిగిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరద బీభత్సానికి కేదార్‌నాథ్ పైభాగంలోని గాంధీ సరోవర్ వరదలే కారణమని 80 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 2 రోజుల్లో 375మి.మీ వర్షపాతం నమోదైందని ఆయన వివరించారు.