కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హెలికాప్టర్‌తో సహాయ చర్యలకు అటంకమేర్పడింది. ఇంకా వేలాది మంది యాత్రీకులు వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో యాత్రికులు మరింత అందోళనకు గురౌతున్నారు. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆర్మీ సిబ్బంది సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 70వేల మందిని రక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అవసరమైతే మానవరహిత హెలికాప్టర్లను వినియోగించే అంశంపై కూడా అధికారులు సమాలో చనలు జరుపుతున్నారు.