కేన్సర్‌ హస్పిటల్‌ విస్తరణకు సహకరించండి

2

సీఎం కేసీఆర్‌తో బాలయ్య
హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి):
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నటుడు బాలకృష్ణ సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో చేపడుతున్న కార్యక్రమాలు, రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. అలాగే ఆస్పత్రిలో కట్టడాలను బిఆర్‌ఎస్‌ కింద రెగ్యులరైజ్‌ చూయాలని సిఎంను కోరారు. వివిధ విభాగాలకు గాను వీటిని నిర్మించారు. వీటిని రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఇదిలావుంటే హైదరాబాద్‌ ఆస్పత్రులలో రోగుల కోసం నైట్‌ షెల్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని సిఎం కెసిఆర్‌ అభిప్రాయపడ్డారు. అన్ని ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందుకు ఆస్పత్రులు కూడా సహకరించాలన్నారు. బసవతారకం ఆస్పత్రిలో చేపడుతున్న వైద్యసేవలను సిఎం అబినందించారు. డిక్టేటర్‌ సినిమా చూడాలని సీఎంను బాలయ్య కోరారు. డిక్టేటర్‌ చూసేందుకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. ఇక వందో సినిమా ఎప్పుడు చేస్తున్నారని బాలయ్యను సీఎం అడిగారు. ఆదిత్య 369కు సీక్వెల్‌గా వందో సినిమా చేస్తున్నానని బాలయ్య తెలిపారు. కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ చిత్రాలు ఎక్కువగా చూసేవాడినని గుర్తు చేసుకున్నారు.