కేరళలో కొనసాగుతున్న ఆందోళనలు

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసనలు
త్రివేండ్రం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిని అంగీకరించేది లేదని నినదిస్తున్నారు. రాజధాని  త్రివేండ్రంలో బుధవారం మహిళలు ర్యాలీ తీశారు. సుప్రీం తన తీర్పును వెనక్కి తీసుకోవాలని వాళ్లు డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ కూడా నిరసనకారులకు మద్దతు తెలిపింది. చెంగనచెరీలో వాళ్లు ర్యాలీ తీశారు. వివిధ ఐక్య వేదిక గ్రూపులకు చెందిన ఆందోళనకారులు కూడా కేరళ వ్యాప్తంగా రోడ్డు ధర్నా చేపట్టారు. హైవేలను బ్లాక్‌ చేశారు. ఎర్నాకుళం, తిరువనంతపురం, కన్నూరు, కోజికోడ్‌, తిస్సూర్‌, పాలక్కాడ్‌ జిల్లాలో ధర్నా నిర్వహించారు. చాలా చోట్ల భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లోనూ బందోబస్తును ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్జ్గం/న్సీ అంబులెన్స్‌ వాహనాలను, పెళ్లి బృందాలకు మాత్రమే హైవేపై అనుమతిస్తున్నారు. కొన్ని హిందుత్వ సంఘాలు అయ్యప్ప పాటలు పాడుతూ రోడ్లపై బైఠాయించారు.