కేరళ సీఎంగా పి. విజయన్‌

కేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నేత పి. విజయన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్ అచ్యుతానంద్ ను కాదని పార్టీ అగ్రనాయకత్వం విజయన్ వైపే మొగ్గుచూపింది. కేరళ కొత్త సీఎం ఎన్నిక కోసం సమావేశమైన పార్టీ పొలిట్ బ్యూరో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం పదవి విషయంలో ముందునుంచి విజయన్ కు అచ్యుతానంద్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అచ్యుతానంద్ వయసు 93 సంవత్సరాలు కావటంతో సీఎం బాధ్యతలు నిర్వహించటం కష్టమని పార్టీ అధినాయకత్వం భావించింది. దీంతో విజయన్ కే అవకాశం ఇచ్చారు. ఐతే అచ్యుతానంద్ క్లీన్ ఇమేజ్ కారణంగానే కేరళలో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయం సాధించింది. విజయన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ సీపీఎం నేతలకు మరో అవకాశం లేకపోకుండా పోయంది. దీంతో విజయన్ నే సీఎం పదవి వరించింది.