కేసముద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కేసముద్రం జూన్2(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కేసముద్రం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగానే కేసముద్రం మండలం తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కమటం శ్రీనివాస్ జెండా ఎగురవేసినారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అధితిగా జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి ,వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి ,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,సర్పంచ్ ప్రభాకర్,రైతు కోఆర్డినేటర్ ప్రవీణ్ ,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వీరు నాయక్ ,ఎంపీటీసీ సట్ల వెంకన్న ,ఎంపీటీసీ కొమ్ము స్వాతి రాహుల్ , కొండ్రిడ్డి రవీందర్ రెడ్డి,నజ్జు,నీలం దుర్గేష్, ముత్యాల శివకుమార్,వీరస్వామి,రేనుకుంట్ల సుధాకర్‌ ,నరసింగం వెంకటేశ్వర్లు,తరాల వెంకన్న, బాలునాయక్,గోపి,నాగిరెడ్డి ,యాకుబ్ రెడ్డి,మహేందర్,ఎడ్ల రవి,బాణోత్ వెంకన్న ,దేవేందర్, బీమా నాయక్, రేవంత్, రాజేష్ ,రాపోలు శ్రీను మరియు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.