కేసీఆర్‌ను విమర్శిస్తే ఓట్లు రాలవు: ఎమ్మెల్యే
జనగామ,ఆగస్ట్28(జనం సాక్షి ): తెలంగాణలో అమలతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయని, ఫలితాలను చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు విస్తుపోతున్నాయని ఎమ్మెల్యే దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభతో ప్రజలకు చేస్తున్న కార్యక్రమానలు వివరిస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ కుటిల రాజకీయాలను ఎండగడతామని అన్నారు.ప్రతిపక్షాలు కేసీఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవన్నారు. గ్రామానికి రూ. కోటి నుంచి రెండు కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి పనులు చేశానని, ఇక వచ్చేది టీఆర్‌ఎస్ పాలనేనని అన్నారు. ప్రభుత్వం పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు.గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని కులాలు, వృత్తులకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారని చెప్పారు.తెలంగాణలో 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, విద్యాభివృద్ధికి రూపొందిస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ప్రసూతి సాయం అందజేస్తున్నట్లు వివరించారు. అన్నివర్గాల ప్రజల బాగోగులు చూసే గొప్ప ప్రభుత్వం మరొకటి లేదని, ఇంతటి ఆలోచన చేస్తున్న కేసీఆర్‌కు అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. మిషన్ భగీరథ నీరు పాలకుర్తి నియోజకవర్గానికి 4 నెలల ముందే వచ్చాయని, కెసిఆర్ పనితీరుకు నీళ్లే నిదర్శనమన్నారు. ప్రగతి నివేదన సభకు అంతా హాజరై ఆశీర్విదించాలన్నారు.



