కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నాడు

– ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తులు న్యాయబద్ధమైనవి
– ప్రైవేట్‌పరం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారు
– కార్మికులకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుంది
– టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క
హైదరాబాద్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : సీఎం కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నారని, సీఎం ¬దాలో ఉండి మొండివైఖరితో ముందుకెళ్లడం సరికాదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నానన్న ప్రకటన దేశ చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్న సమస్యలు న్యాయబద్ధమైనవని భట్టి అన్నారు. దశాబ్దాలకాలం నుంచి కాపాడుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారని అన్నారు. వారికి విజ్ఞప్తులు పట్టించుకోకుండా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కారణం కార్మికులే అంటూ ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని భట్టి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందని కేసీఆర్‌ తెలుసుకోవాలని సూచించారు. డీజిల్‌ పై 20రూపాయలు వ్యాట్‌ గా తీసుకుంటుందని, డీజిల్‌ ధర రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల ఆర్టీసీ పై భారం పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉన్న డీజిల్‌ పై రేట్లు పెంచడంతో ఆర్థిక భారం పడుతుందన్నారు. ఆర్టీసీ 20కోట్ల లీటర్ల డీజిల్‌ వాడుతుందని, ఒక్కో లీటర్‌ పై 20 రూపాయలు పన్ను వేస్తున్నారని అన్నారు. డీజిల్‌ వల్ల ఏడాదికి 4వందల కోట్లు ఆర్టీసీ నష్టపోతోందని భట్టి పేర్కొన్నారు. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న ఆర్టీసీ కేసీఆర్‌ పాలన వల్ల కుదేలు అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీని కాపాడేందుకు ఆర్థిక సాయం చేశాయని, తెలంగాణ సమాజంలో ఉన్న ఫ్యూడల్‌ వ్యవస్థకి కేసీఆర్‌ స్వస్తి చెప్తున్నారని అన్నారు. అనాదిగా వస్తున్న ఆర్టీసీ ఆస్తులను అక్రమంగా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని భట్టి పేర్కొన్నారు. ఇప్పటికే వరంగల్‌ తో పాటు  ప్రాంతాల్లో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించినట్లు తెలుస్తుందని, కార్మికుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భట్టి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టాన్రికి దేశంలో ఉన్న అన్ని రాష్టాల్రకు తేడా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో సాదించుకున్నామని, దేశంలో అన్నిరాష్టాల్రతో పోల్చడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇతర రాష్టాల్ల్రో ఆర్టీసీ లేదని తెలంగాణ ఆర్టీసీని మూసివేస్తారా అంటూ భట్టి కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌కి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి కాదని అన్నారు. రాష్ట్రం 5వేల కోట్ల అప్పులను తీర్చలేని కేసీఆర్‌, 6లక్షల కోట్లు అప్పు మరో మూడేళ్ళలో అవుతుందని, అలాఅని రాష్టాన్న్రి అమ్మేస్తారా అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ వెనక్కుతగ్గి కార్మికులను సమస్యలను పరిష్కరించాలని తద్వారా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భట్టి కోరారు.