కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలతో.. మననీళ్లు మనం తాగే పరిస్థితి తెచ్చుకోవద్దు


– మనవిూద కేసీఆర్‌ పెత్తనం చేయాలని చూస్తున్నారు
– కుట్రలు పన్నే కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ కడుతున్నాడు
– ఎన్నికల యుద్దంలో దోపిడీదొంగలకు గట్టి గుణపాఠం చెబుదాం
– ‘దొంగలు వస్తున్నారు జాగ్రత్త’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లండి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి26(జ‌నంసాక్షి) : కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలతో మననీళ్లు మనం తాగే పరిస్థితి తెచ్చుకోవద్దని, జగన్‌ను అడ్డుపెట్టకొని కేసీఆర్‌, ప్రధాని మోదీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో  చంద్రబాబు మాట్లాడారు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని, గొడవలు ఎందుకు? అనే తత్వం తనదని అన్నారు. అలాంటిది ఇప్పుడు మనవిూద కేసీఆర్‌ పెత్తనం చేద్దామని చూస్తుంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్లు తనకి ఊడిగం చేయాలి అన్న రీతిలో కేసీఆర్‌ కుట్రలు పన్నుతుంటే సహించొద్దని అన్నారు. అలాంటి వ్యక్తితో కలిస్తే తప్పేంటి అని జగన్‌ అంటున్నాడంటే.. అతడి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. అవకాశం, వితండవాదంతో జగన్‌ తన బలహీనతలన్నింటినీ బహిర్గతం చేసుకుంటున్నాడని విమర్శించారు. దొంగ వస్తున్నాడు జాగ్రత్త అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కును నిరసిస్తూ తోచిన విధంగా నిరసనలు తెలపాలన్నారు. కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలతో మన నీళ్లు మనం తాగే పరిస్థితి తెచ్చుకోకూడదని, ఎన్నికల యుద్ధంలో దోపిడీ దొంగలకు గట్టిగా బుద్ధి చెబుదామని నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలీసులపై జగన్‌ కుల ముద్ర వేయడం నీచాతినీచమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పుడు రాష్ట్ర విభజనపై పోరాడామని, ఇప్పుడు ఆంధ్రాద్రోహులపై పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ధర్మం వెన్నంటే ఉందని ఆయన స్పష్టంచేశారు. తెదేపా సంక్షేమ పథకాలపై ప్రజల్లో అపూర్వ ఆదరణ ఉందన్నారు. ఓటమి భయంతోనే వైకాపాసైకో పార్టీగా వ్యవహరిస్తోందన్నారు. తెదేపాలో పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కేసీఆర్‌ ఉద్యమం ప్రారంభించారని చంద్రబాబు గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలగొట్టిన వాళ్లకు జగన్‌ మద్దతిస్తారా? పోలవరంపై పిటిషన్లు వేసేవాళ్లకా వైకాపా మద్దతు? అని చంద్రబాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నివసించే జగన్‌కు ఆంధ్రోళ్లనంటే బాధ ఎలా ఉంటుందన్నారు. దొంగలు దొరికిపోయారు.. నడి బజారులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దొంగ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలని చంద్రబాబు పిలునిచ్చారు. ప్రజలంతా వీరోచితంగా పోరాడాలి. టీడీపీ సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఆదరణ ఉందని, అది భరించలేకే జగన్‌ దొంగనాటకాలు, కుతంత్రాలు. ఫెడరల్‌ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌తో కలిసి జగన్‌ నాటకాలు. ¬దా ఇస్తామన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడు. ఎవరొస్తే వాళ్లకిస్తానని గోడవిూద పిల్లి నాటకమని చంద్రబాబు చెప్పకొచ్చారు.