కేసీఆర్, వినోద్‌ల విధానాలపై బహిరంగ చర్చకు సిద్దమా?
-తేదీ, సమయం, వేదిక ప్రకటించాలి
-మద్యవర్తులుగా లోక్‌సత్తా, జర్నలిస్టు సంఘాలుండాలి
-జిల్లాను అన్నింటా ముంచేసిందికాక, ప్రతి విమర్శలా….?
-రేషన్ దుకాణాలపై నాటిమాటలేవి కేసీఆర్
-సూటిగా ప్రశ్నించిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, అక్టోబర్ 24 (జనంసాక్షి): కరీంనగర్ పార్లమెంట్ జిల్లా అభివృద్దిపై తన ఐదేళ్ల ఎంపి పాలన కేసీఆర్ ఐదేళ్లు,, వినోద్‌కుమార్ మూడున్నరేళ్ల మొత్తం ఎనమిదిన్నర ఏళ్లపాలనపై ఎలాంటి బహిరంగ చర్చకైనా తాను సిద్దమని, ఎంపి మంత్రి వస్తే తాను వస్తానని, మేయర్‌ను పంపిస్తే మా ఫ్లోర్ లీడర్ వస్తాడని దేనికి సిద్దమో ఎంపి, టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రకటించాలని మాజీ ఎంపి, టీపీసీసీ ఉపాధ్‌క్షుడు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహంలో నగర అద్యక్షుడు కర్ర రాజశేఖర్, బీసీ, ఎప్సీ సెల్ అద్యక్షులు మదు, రవి, కార్పోరేషన్ ప్లోర్ లీడర్ ప్రకాశ్, జిల్లా అధికార ప్రతినిధి రత్నాకర్ తదితరులతో కలిసి విూడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల మెగా టెక్స్‌టైల్ పార్క్‌కోసం తాను ఎంపిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రతిపాదించడం జరిగిందని దీనిని కాదని కేవలం ఆజంజాహి మిల్లుండేననే భ్రమలు కల్పిస్తూ టీఆర్‌ఎస్ అత్యధిక నేతన్నలున్న సిరిసిల్లను కాదని వరంగల్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడంను జిల్లా ఎంపిలు మంత్రులు, ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. వస్త్రపురిగా గప్పాలు కొడుతూ శంకుస్థాపన చేశారని దీనికి ఇప్పటివరకు ఇంచు కాగితం కూడా కేంద్రంనుంచి మంజూరు కాలేదన్నారు. శంకుస్థాపనలో కేంద్ర మంత్రి లేకుండా చేశారంటే దీనిని ఎవరు నమ్ముతారని నిలదీశారు. నిజంగా ఆరోజు సిరిసిల్లకు చీకటి దినమే అవుతుందన్నారు. రాష్ట్రంలో 49 వేల పవర్‌లూంలుంటే అందులో 30వేల పవర్‌లూంలు సిరిసిల్లలో ఉన్నవనేది వాస్తవం కాదా అని నిలదీశారు. నేత కార్మికులున్న చోట వారికి ఉపాదికల్పించేందుకా లేకా బడా వ్యాపారుల జేబులు నింపడానికా చెప్పాలన్నారు. సొంత బిడ్డ సొంత బిడ్డేనని, సాదుకున్న బిడ్డగాఉన్న ఎంపి వినోద్, కేసీఆర్‌లు అలాగే వివక్షతోనే ఉంటారనేది వాస్తవమన్నారు. తెలంగాణా ఉద్యమంలో వెన్నంటి ఉన్న కరీంనగర్ జిల్లాకు చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకు హార్టికల్చర్ యూనివర్శిటీ, లెదర్ పార్క్, మెడికల్ కళాశాల, తదితరాలన్ని ఏమయ్యాయన్నారు. ఇప్పటికిప్పుడు సైనిక్ స్కూల్ కూడా తరలించకపోయినా ఎందుకు కేటాయించలేదని ప్రభాకర్ నిలదీశారు. గతంలో సీమాంద్ర ముఖ్యమంత్రులు, వారి పాలన ఉంది కాబట్టే తెల్లారితే కొట్లాట పెట్టుకుని అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణాకోసం ఉద్యమాలు చేసింది విూకల్లకు కనిపించలేదా..ఇప్పుడు కల్లకు బైర్లు కమ్మాయా, చెవులు మూసుకుపోయాయా అన్నారు. వీటిపై బహిరంగంగా చర్చించేందుకు ఈనెల 30వతేదీన ప్రెస్ క్లబ్‌కు రావాలని, లేకుంటే విూరే తేదీ వేదిక ప్రకటించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా, జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు సందాన కర్తలు గా వ్యవహరించి జిల్లా అభివృద్దిపై ప్రజలకు ఓ క్లారిటీనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.
తెల్లారితే విూరేం చేశారని ప్రశ్నించడం మానుకుని వేదిక సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌కోసం కేవలం ఎంపి రాసిన లేఖలను పత్రికలకు విడుదల చేసి చేతులు దులుపుకోవడం కాదని, కేంద్రంనుంచి ఏమైనా సాదించారేమె చూపించాలని డిమాండ్ చేశారు. తాను ఎంపిగా ఉండగా కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం కేటాయించిన ప్రతిని జర్నలిస్టు సంఘాల ముందుంచుతున్నానన్నారు. పంచాయితీ ఎన్నికలగురించి క్యాబినెట్ విూటింగ్‌లో నిర్ణయించిన మేరకు అమలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అని ప్రభాకర్ ప్రశ్నించారు. పంచాయితీ సర్పంచ్‌లు పనిచేయకపోతే హావిూలు అమలు చేయకపోతే వారిని తొలగిస్తామంటున్న కేసీఆర్ నీ నోటినుంచి ఇచ్చిన హావిూలను ఇప్పటికి అమలు చేయకపోతే ఏంచేయాలి, ఎవరు చేస్తారని ప్రశ్నించారు. మూడున్నరేల్లలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది వాస్తవం కాదా అన్నారు. నిధులు లేక జడ్పీలు పంచాయితీలు, మండల పరిషత్‌లు అన్నమోరామచంద్రా అంటున్నా కూడా కనీసం కనికరించిన పాపాన పోలేదని ఇది ప్రజలకు తెలువదా అన్నారు. గతంలో ప్రకటించిన మన మన ఊరు ప్రణాళిక, మండల ప్రణాళిక, జిల్లా ప్రణాళికలు ఏమయ్యాయని, రాష్ట్రంలో కేసీఆర్ సృష్టించుకున్న భజన శాఖ మంత్రిగా విరాజిల్లుతున్న గవర్నర్‌నరసింహన్‌తో ప్రారంభించిన గ్రామ జ్యోతి కార్యక్రమం అటకెక్కింది వాస్తవం కాదాఅన్నారు. అలాగే రేషన్ దుఖాణాలను అధికారంలోకి రాగానే మినీ షాపింగ్ మాల్స్ గా మారుస్తామన్న కేసీఆర్ నేడు ఆవ్యవస్థనే తొలగించేందుకు చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు. అదే జరిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు.రేషన్ దుఖానాలద్వారా గతంలో తామిచ్చిన 9సరుకులు అటకెక్కించారని, గోదుమలు, చక్కెర మంట్లోకలిపారని, కేవలం బియ్యం కూడా ఇవ్వకుండా నగదు బదిలీ పథకం చేస్తామంటే ఎవరు నమ్ముతారన్నారు దీనిద్వారా మరోసారి మద్యం షాపులు బెల్టు షాపులు పెంచుకునే లక్ష్యం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. రేషన్ దుఖాణాల రద్దుకు ఏమాత్రం చర్యలు తీసుకున్నా చూస్తూ ఊరుకోబో మని ఖబడ్దార్ అంటూ మాజీ ఎంపి హెచ్చరించారు. విూరేం చేయకపోయినా తమ ప్రభుత్వం రాగానే కరీంనగర్, సిరిసిల్లకు జెఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలను తెస్తామని, కరీంనగర్, గోదావరిఖనికి మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని వెల్లడించారు.