కొండమల్లేపల్లి లో కోటిన్నర నగదు పట్టుకున్న పోలీసులు

కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనం సాక్షి : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొండమల్లేపల్లి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు గుర్తింపు పత్రాలు లేకుండా నగదు కనపడితే వెంటనే సీజ్ చేస్తున్నారు ఈ క్రమంలో హైవేపై వెళ్తున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా నగదు దొరికితే వెంటనే సీజ్ చేస్తున్నారు కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వీరబాబు పర్యవేక్షణలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వారి సమక్షంలో విధులు నిర్వహిస్తుండగా శుక్రవారం నాడు భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళుతుంటే బైక్ ను ఆపి కస్టడీలోకి తీసుకొని విచారిస్తుండగా కోటిన్నర భారీ నగదు పట్టుబడింది సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన ఈ తనిఖీలో చింతపల్లి మండలం వెంకటేశ్వర కాటన్ మిల్ డైరెక్టర్ కన్నెగంటి వెంకటనారాయణ శ్రీనివాస్ వ్యాపారుల వద్ద నుండి ఆధారాలు లేకపోవడంతో కోటిన్నర నగదును పట్టుకొని దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు సమక్షంలో పంచనామా నిర్వహించి తదుపరి విచారణకు నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రివెన్స్ సెల్ కమిటిలో ఈ నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించి నగదు తీసుకోవచ్చని అన్నారు మరో ఇద్దరు వ్యక్తుల నుండి రూ. 84500, రూ.94,500 లను పట్టుకొని పోలీసులు సిజ్ చేశారు ఈ తనిఖీలో తహశీల్దార్ దివ్యరెడ్డి ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి ఎంపివో వెంకన్న డిటి అయ్యూబ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు