కొండరెడ్డిపల్లెను దత్తత తీసుకున్న ప్రకాశ్‌రాజ్‌

1
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న గ్రామాభివృద్ది కార్యక్రమాలు పలువురిని అకర్షిస్తున్నాయి.  గ్రామాజ్యోతి లాంటి కార్యక్రమంతో గ్రామాలకోసం చేస్తున్న కృషిని చూసి….ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ రోజు సచివాలయంలో పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావుని కలిసి మహబూబ్‌ నగర్‌ జిల్లా కేశంపేట మండలంలోని కొండా రెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న అకాంక్షని  మంత్రికి తెలియజేశారు. ప్రకాశ్‌ రాజ్‌ పౌండేషన్‌ ద్వారా ఈ గ్రామంలో పలు రంగాల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు ప్రకాశ్‌ రాజ్‌ ముందుకు వచ్చారు. తాను ఇప్పటికే కర్నాటకలో తన పౌండేషన్‌ ద్వారా చేస్తున్న పలు కార్యక్రమాలను మంత్రికి వివరించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొండా రెడ్డి పల్లెలో తాను వ్యవసాయం చేస్తున్నట్లు…ఇందులో పలు  శాస్త్రీయ పద్దతులను అనుసరిస్తున్నట్లు తెలిపారు. అయితే తాను నివసిస్తున్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని…అక్కడి రైతులకి సహయం అందించేందు….గ్రామంలో మౌళిక వసతుల కల్పనకి ప్రభుత్వంతో పనిచేసేందుకు మందుకు వచ్చినట్టు అయన మంత్రికి తెలిపారు. ఇప్పటికే తన సిబ్బంది గ్రామస్ధాయిలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారని….అది ముగియగానే గ్రామంలో తాను చేపట్టాలనుకుంటున్న పనుల వివరాలను వెళ్లడిస్తానని తెలిపారు.

గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన ప్రకాశ్‌ రాజ్‌ ని మంత్రి అభినందించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి….మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, స్థానిక యంఏల్యే అంజయ్య యాదవ్‌ లను ప్రకాశ్‌ రాజ్‌ తో మాట్లాడించారు. అయనకి పూర్తి సహకారం అందించాల్సిగా కోరారు.  గ్రామంలో చేపట్టాల్సిన పనుల కోసం కొండారెడ్డిపల్లెలో గ్రామస్ధులతో సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కోరారు.

గ్రామాల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి …..తమ ప్రయత్నాలను పల్లెలతోపాటు పలు రంగాల్లోని ప్రముఖులు మద్దతు పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు కంపెనీలు కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకి ముందుకు వస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో వంద శాతం పారిశుద్యమే లక్ష్యంగా ముందుకుపొతున్న ప్రభుత్వంతో ఇప్పటికే పలు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.