కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకోవాలి : కేటీఆర్
కరీంనగర్: కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకొని చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీ తరపున విజయమ్మ, టీడీపీ తరపున చంద్రబాబు పాల్గొంటే సోనియా, బొత్స కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 28న సీమాంధ్ర పార్టీల వైఖరి తేటతెల్లమవుతుందని చెప్పారు. జగన్ నేర చరిత్రగల కుటుంబంలో పుట్టిన వ్యక్తి అని చెప్పారు. అందుకే తెలంగాణవాదులపై హింసకు పాల్పడేలా కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.