కొడుకు దాడిలో తల్లి మృతి
వరంగల్, జనంసాక్షి: జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన బండారు సుగుణమ్మ, బిక్షమయ్య దంపతులపై కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకు సూరయ్య దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.