కొత్తరకం దోపిడీకి..  చంద్రబాబు శ్రీకారం చుట్టాడు

– అనుయాయులకు వేలకోట్లు దోచిపెట్టి రివ్యూలు చేస్తున్నాడు
– రివ్యూల వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకోవాలి
– వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : చంద్రబాబు కొత్తరకం దోపిడీకి తెరతీశారని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. శనివారం ఆనం రామనారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అనుయాయులకు రూ.వేల కోట్లు దోచిపెట్టేందుకే చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్ఠకి చేరిందన్నారు. సీఎం స్థాయి వ్యక్తి హుందాగా ఉండాలని సూచించారు. రివ్యూల వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మండిపడ్డారు. కనీసం జీతభత్యాకు కూడా వేస్‌ అండ్‌ విూన్స్‌ కింద అప్పు తీసుకొచ్చి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచంలో తానే గొప్ప ఆర్థికవేత్తగా చెప్పుకునే చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని నిప్పులు చెరిగారు.
అభివృద్ధి తానే చేశానని చెప్పే బాబు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా ఉన్నతాధికారులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారన్నారు. తమ అనుచరులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకే సవిూక్ష సమావేశాలు
నిర్వహించారని విమర్శించారు. కొత్త రకం దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు పెరగక పోగా అప్పులు పెరిగాయన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత తన అనునాయులకు నిధులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక శాఖ ద్వారా ఏదైనా జీఓ వస్తే దాన్ని వెబ్‌ సైట్‌లో పెట్టాలని, రహస్య జీఓల పేరుతో ఉత్తర్వులు ఇచ్చి నిధులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఈ జీవోలను బయట పెట్టాలని గవర్నర్‌ నరసింహాన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్‌ రాంనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ చేసి కుట్రదారులను బయట పెట్టాలని, పోలవరం పేరుతో 11 వేల కోట్ల రూపాయల మేర నిధులను కట్టబెడుతున్నారని, సవిూక్షల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు పని చేస్తున్నారని విమర్శించారు. గత ఏడాది నుంచి ఇచ్చిన జీఓలపై విచారణ చేయాలని, దీనిపై తక్షణం ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని రాంనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు.