కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’
` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం
` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్ విజయంపై ప్రధాని మోదీ
` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు
` ఇది ఆరంభం మాత్రమే.. ఆదిత్య మిషన్ సక్సెస్‌గా సాగుతోందన్న :ఇస్రో ఛైర్మన్
శ్రీహరికోట,జనవరి1(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లిన వాహకనౌక 21.5 నిమిషాల్లో నిర్ధేశిత కక్ష్యలోకి అత్యాధునిక ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు మరో పది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తున్నది. ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500`700 కిలోవిూటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ (ఎక్స్`కిరణాలలో పొలారివిూటర్ పరికరం), ఎక్స్`రే స్పెక్టోస్రోపీ, టైమింగ్ (ఎక్స్‌పెక్ట్`ఎక్స్స్పీఈసీ
’కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం’: ప్రధాని మోదీ
కొత్త ఏడాదికి ఇస్రో శాస్త్రవేత్తలు గొప్ప శుభారంభం ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.’’2024కు గొప్ప శుభారంభం ఇచ్చిన మన శాస్త్రవేత్తల బృందానికి ధన్యవాదాలు. ఇది అద్భుతమైన వార్త. ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో భారత్ నైపుణ్యానికి నిదర్శనం. ఈ విజయంతో భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.ఎక్స్‌పోశాట్ విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘’అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనం. కృష్ణబిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల పరిశోధన కోసం ఎక్స్‌పోశాట్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు చారిత్రాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కొత్త ఏడాది తొలి రోజున ఇంతటి విజయాన్ని అందించిన వారికి శుభాకాంక్షలు’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.’’కొత్త సంవత్సరంలో పీఎస్‌ఎల్‌వీ`సీ58/ఎక్స్‌పోశాట్
ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్ అభినందనలు
భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ`సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాకెట్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్నరెండో దేశంగా భారతదేశం అవతరించింద న్నారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసిలో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్‌ఎల్‌వీ` సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందనలు
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ`సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్‌ఎల్‌వీ`సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ సందర్బంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్‌ఎల్‌వీ`సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు.