కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభం
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఈ ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణంచేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు హాజరయ్యారు.