కొనసాగిన కోహ్లీసేన జైత్రయాత్ర
న్యూజిలాండ్‌పై వరుస విజయాలతో వన్డే సీరిస్ కైవసం
అద్భుతంగా రాణించిన బౌలర్లు, బ్యాట్స్‌మెన్
244 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయసంగా ఛేందించిన భారత్
మౌంట్ మాంగనూయ్,జనవరి28(జనంసాక్షి): ఆస్టేల్రియాను వారు సొంతగడ్డపై మట్టికరిపించిన టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనలోనూ అదే జోరు ప్రదర్శించి అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన భారత జట్టు రెండు వన్డేలు మిగిలుండగానే 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీసేన వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 3-0తో ఆధిక్యంలో నిలిచింది.సొంతగడ్డ
పై పేలవ ప్రదర్శన చేసిన కివీస్ భారీ మూల్యం చెల్లించుకుంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాను కివీస్ స్టార్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. కోహ్లీసేనకు తిరుగులేదు. న్యూజిలాండ్‌పై వరుసగా మూడో వన్డే గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. ముందు బౌలర్లు.. తర్వాత బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించారు. నిలకడతో అదరగొట్టారు. దెబ్బకు కివీస్ చేసేదేవిూ లేక డీలా పడిపోయింది. ఒకప్పుడు ఆసీస్, కివీస్ పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడాలంటే టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకవైపు పేస్. మరోవైపు మణికట్టు మాయ. భీకరమైన టాప్, మిడిలార్డర్. అందుకే భారత్ వరుసగా రెండో వన్డే సిరీస్‌ను గెలిచింది. స్మిత్, వార్నర్ లేని ఆసీస్‌పై సునాయాసంగా గెలిచిందన్న మాటలకు ఘాటు సమాధానం చెప్పింది కోహ్లీసేన. నిలకడకు పేరైన పటిష్ఠ న్యూజిలాండ్ జట్టుపై జైత్రయాత్ర కొనసాగించింది. ఇక విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. 63 వన్డేలకు సారథ్యం వహించగా 47 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. క్లైవ్‌లాయిడ్, రికీ పాంటింగ్ 50 వన్డే విజయాల రికార్డుకు చేరువలో నిలిచాడు.కివీస్ నిర్దేశిరచిన 244 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(62), కెప్టెన్ విరాట్ కోహ్లీ(60), అంబటి రాయడు(40 నాటౌట్), దినేశ్ కార్తీక్(38 నాటౌట్) రాణించడంతో లక్ష్యాన్ని 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ వన్డే కెరీర్‌లో 39వ ఫిప్టీ సాధించగా.. విరాట్ 49 అర్ధశతకాలు నమోదు చేయడం విశేషం. వన్డేల్లో రోహిత్-విరాట్ ద్వయం 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి. రెండో వన్డేలో చెలరేగిన శిఖర్ ధావన్(28) ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. పర్యాటక బ్యాట్స్‌మెన్‌ను ఏ బౌలరూ ఇబ్బంది పెట్టలేకపోయాడు. ట్రెంట్ బౌల్ట్ రెండు, మిచెల్ సాంట్నెర్ ఒక వికెట్ తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అంతకుముందు రాస్ టేలర్(93: 106 బంతుల్లో 9ఫోర్లు), టామ్ లాథమ్(51: 64 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు మహ్మద్ షవిూ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్య(2/45), చాహల్(2/51) విజృంభించారు.
మొదటి రెండు వన్డేల్లోలాగే ఓపెనర్లిద్దరిని భారత బౌలర్లు ఆరంభంలోనే పెవిలియన్ పంపి వికెట్ల పతనానికి తెరదీశారు. గప్తిల్(13)ను భువీ.. మన్రో(7)ను షవిూ ఔట్ చేశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ చాహల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య అద్భుత క్యాచ్‌కు కేన్ నిష్కమ్రించాల్సి వచ్చింది. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బలంగా నిలబడి జట్టును మెరుగైన స్థితిలో నిలిపింది. 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్(81), టామ్ లాథమ్(51) ఆదుకున్నారు. లాథమ్ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు.
బౌలింగ్.. ఫీల్డింగ్ అదుర్స్..!
రెండు వారాలుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ శంకర్ స్థానంలో జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసిన పాండ్య అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రమశిక్షణతో బంతులేసిన పాండ్య 10 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లు పరుగులను కట్టడి చేయడంతో పాటు కీలక సమయాల్లో కివీస్ భాగస్వామ్యాలను విడదీయడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించడకుండా అడ్డుకున్నారు. ఇన్నింగ్స్ ఆఖర్లో సెంచరీకి చేరువగా వచ్చిన టేలర్‌ను షవిూ ఔట్ చేసి స్కోరు వేగానికి క్లళెం వేశాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక ఓవర్
మిగిలుండగానే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
కోహ్లీ-శర్మ బ్యాటింగ్ విన్యాసం
న్యూజిలాండ్ నిర్దేశిరచిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభమే లభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (28; 27 బంతులు), రోహిత్ శర్మ (62; 77 బంతులు) పోటీ పడి ఆడారు. కాగా, జట్టు స్కోరు 39 వద్ద గబ్బర్‌ను బౌల్ట్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ (60; 74 బంతులు) మరోసారి తన అందమైన ఆటను ప్రదర్శించాడు. సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూనే సొగసైన కవర్‌డ్రైవ్‌లు ఆడాడు. అతడికి తోడుగా రోహిత్ శర్మ అప్పుడప్పుడు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రోహిత్‌శర్మను ఔట్ చేయడం ద్వారా శాంట్నర్ విడదీశాడు. అప్పుడు స్కోరు 152. మరికాసేపటికే కోహ్లీని బౌల్ట్ పెవిలియన్ పంపించాడు. అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో భారత్ విజయం సాధించేందుకు కష్టపడలేదు. అంబటి రాయుడు (40; 42 బంతులు), దినేశ్ కార్తీక్ (38; 38 బంతులు) పోటీపడి ఆడారు. నువ్వానేనా అన్నట్టు బౌండరీలు బాదేశారు. నాలుగో వికెట్‌కు 77 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దీంతో కోహ్లీసేన 43 ఓవర్లకే ఛేదన పూర్తిచేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షమికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
మళ్లీ షమి..విజృంభణ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. మార్టిన్ గప్తిల్ (13), కొలిన్ మన్రో (7), కేన్ విలియమ్సన్ (28) జట్టు స్కోరు 59 లోపే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో టామ్ లేథమ్ (51; 64 బంతుల్లో 1/-ఖ4, 1/-ఖ6)తో కలిసి సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (93; 106 బంతుల్లో 9/-ఖ4) చెలరేగాడు. శతకానికి చేరువయ్యాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆచితూచి ఆడుతోనూ చూడచక్కని షాట్లతో విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని లేథమ్‌ను ఔట్ చేయడం ద్వారా చాహల్ విడదీశాడు. అప్పుడు జట్టు స్కోరు 178. ఒక వైపు వికెట్లు పడుతున్న టేలర్ ప్రతిఘటించాడు. 222 పరుగుల వద్ద షమి అతడిని పెవిలియన్ పంపించాడు. కివీస్ 243 పరుగులకు ఆలౌటైంది. షమి 3, భువి, చాహల్, పాండ్య, కుల్‌దీప్ తలో రెండు వికెట్ల పడగొట్టాడు.