కొనసాగుతున్న ఆపరేషన్ గంగ
ఢల్లీికి చేరుకున్న మరో 630 మంది విద్యార్థులు
ప్రధానిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్టూడెంట్స్
భారతీయలును సేఫ్‌గగా తరలిస్తామన్న రష్యా
న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): ఉక్రెయిన్ యుద్ధ బీభత్సంలో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను
స్వదేశానికి వేగంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఉన్న కమర్షియల్ ప్లైట్స్ కు తోడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దించింది. ఎయిర్ ఫోర్స్ లో అతి పెద్ద ట్రాన్స్ పోర్ట్ విమానమైన సీ17 ద్వారా మన విద్యార్థులను తరలిస్తోంది. గురువారం ఒక్క రోజులోనే నాలుగు ఎయిర్ ఫోర్స్ విమానాల్లో 798 మందిని ఢల్లీి సవిూపంలోని హిండన్ ఎయిర్ బేస్ కు తీసుకొచ్చింది. వీరందరూ ప్రధాని మోడీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీరితో ప్రధాని ఫోటోలు దిగారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరో 630 మంది భారత పౌరులు శుక్రవారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా, హంగేరిల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి రాత్రి బయలుదేరిన మూడు సీ17 విమానాలు ఉదయం ఢల్లీి సవిూపంలో హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి. వీటిలో 630 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఇదిలావుంటే ఉక్రెయిన్ లోని ఖార్కివ్, సువిూ సిటీల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఆ యుద్ధ భూమిని నుంచి బయట పడేసేందుకు రష్యా ముందుకొచ్చింది. తాము 130 బస్సులను ఏర్పాటు చేసి.. ఉక్రెయిన్ నుంచి సేఫ్ గా తరలిస్తామని రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ హెడ్ కల్నల్ మిఖాయిల్ మిజినంట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ లోని ఖార్కవ్, సువిూ ప్రాంతాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశాల విద్యార్థులను.. రష్యాలోని బెల్గోరోడ్ రీజియన్ కు చేరుస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి విమానాల్లో వారి వారి సొంత దేశాలకు వెళ్లొచ్చన్నారు.