కొనసాగుతున్న పసిడి పతనం

ముంబయి.జనంసాక్షి: గత వారం రోజులుగా పడుతూ వస్తున్న బంగారం ధర ఈ వాళకూడా నష్టాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఉదయం 20 డాలర్ల దాకా కోల్పోతూ 1357 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది.రాత్రి బంగారం ధర పెరగడానికి కొంత ప్రయత్నం చేసింది. అయితే డాలర్‌ ఇండెక్స్‌ బలపడంతో బంగారం ధర పడిపోయింది.
ఒక దశలో 1390 డాలర్లు దాటిన ఔన్స్‌ ధర ఆ తర్వాత నష్టపోతూ వచ్చింది. ఎంసీఎక్స్‌లో కూడా 10 గ్రాముల ధర 25, 900 రూపాయల వరకు వెళ్లింది. ముగింపు వచ్చేసరికి 112 రూపాయలు కోల్పోయిన 25,654 రూపాయల వద్ద ముగిసింది. కేజి వెండి ధర 595 రూపాయలు కోల్పోయి 43,600రూపాయల వద్ద ముగిసింది. ఈవాళ మన మార్కెట్లో రూపాయి గనుక నష్టపోకుండా ఉంటే 10 గ్రాముల బంగారం ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది.