కొనసాగుతున్న లారీల సమ్మె

దేశవ్యాప్తంగా లారీల స్ట్రైక్ వరుసగా నాలుగో రోజు కొనసాగుతోంది. ప్రస్తుత టోల్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత లారీ యాజమాన్య సంఘాలు సమ్మెకు దిగాయి. దేశంలో లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాలు, కూరగాయలు, మందులు వంటి కొన్ని నిత్యావసరాలను సమ్మె పరిధి నుంచి మినహాయించినప్పటికీ… ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వం తమ డిమాండ్ కు అంగీకరించే వరకు సమ్మె విరమించేది లేదని… ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టంచేశారు.