కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దాం..!
చండ్రుగొండ జనంసాక్షి (జూలై 04) : కామ్రేడ్ దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం మండల కార్యదర్శి రామ్ రెడ్డి అన్నారు.సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొమురయ్య ఆశయ సాధన కోసం కమ్యూనిస్టులు ముందుకు సాగాలన్నారు.భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలనే నినాదాలతో సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వేణు రాయి రాజా పెద్ద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.