కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

వర్ధంతి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జడ్పీటీసీ మల్లేశం

చేర్యాల (జనంసాక్షి) జులై 02 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి సభలను అధికారికంగా నిర్వహించాలని చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం కురుమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా ఈనెల 4న ఛలో కొమురవెల్లి బహిరంగ సభ వాల్ పోస్టర్లను శనివారం చేర్యాల మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు కురుమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా  వారు మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి సభలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, కురుమల ఆరాధ్యదైవమైన కొమువెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన చైర్మన్ పదవి కురుమలకే ఇవ్వాలని, చట్ట సభలలో జనాభా నిష్పత్తి ప్రకారం కురుమలకు ప్రాధాన్యం కల్పించి, గొర్రెల మేత భూములను తిరిగి పునరుద్ధరించాలని, కురుమల జనగనన ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కురుమలు విద్య, రాజకీయంతో పాటు ప్రతీ రంగంలో ఎదగాలన్నారు. ఈనెల 4న ఛలో కొమురవేల్లి దొడ్డి కొమురయ్య వర్ధంతి సభకు అధిక సంఖ్యలో తరాలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత జంగిటి కమలాకర్, మున్సిపల్ కౌన్సిలర్ చెవిటి లింగం, కురుమ సంఘం మండల అధ్యక్షులు శెవల్ల రాజయ్య, జర్నలిస్టులు మ్యాక వెంకటేశ్వర్లు, అందె అశోక్, నాయకులు దయ్యాల రాజు, అందె బీరయ్య, ఒగ్గు రాజు, ఒగ్గు మల్లేశం, నంగి మైసయ్య, కాలి దుర్గ ప్రసాద్,ఈరి భూమయ్య, అందె బాబు, ఈరు పవన్, ఒగ్గు శ్రీశైలం, శెవల్ల కృష్ణ, కందూరి వెంకటయ్య, బండారి సిద్ధులు, శెవల్ల వెంకట్, తిగుళ్ల కనకయ్య, తుప్పతి రమేష్, బీర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area