*కొమురయ్య వర్ధంతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ*
దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ ‘దొడ్డి కొమురయ్య 76 వ వర్ధంతి’ పురస్కరించుకొని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యతిధిగా ‘సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ’ పాల్గొని దొడ్డి కొమురయ్య స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సిపిఐ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య అధ్యక్షతన దొడ్డి కొమురయ్య స్మారక భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విసునూరు దేశముఖ్ గుండాలచే తుపాకీ కాల్పులకు 1946 జులై 4వ తేదీన దొడ్డి కొమురయ్య వీరమరణం పొందారని
ఆ అమరత్వంతో భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన ప్రజలు సాయుధపోరాటం నిర్వహించి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసిన మహత్తర పోరాటమని
ఆ పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచ పడ్డాయని
కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా మరియు మండల నాయకులు,తదితరులు పాల్గోన్నారు.