కొరియాల మధ్య నో ఫైర్‌ జోన్‌

 

సియోల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఏర్పడిన సరిహద్దు సవిూపంలో ‘నో ఫైర్‌ జోన్‌’ గా ప్రకటిస్తున్నట్లు గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూంగ్‌ జే ఇన్‌ తెలిపారు. అలాగే సైనిక విన్యాసాలపై కూడా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. గత నెల ప్యోంగ్యాంగ్‌లో ఉభయ కొరియా నేతలు అంగీకరించిన సైనిక ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనేలా సమస్యాత్మకమైన జోన్‌లో (డిఎంజెడ్‌)లో లాండ్‌మైన్స్‌ను

సైనికులను తగ్గిస్తున్నట్లు గురువారం పార్లమెంటులో మూన్‌ జె ఇన్‌ వెల్లడించారు. అమెరికా, కొరియా ద్వీపకల్పాలను అణురహితంగా మార్చి శాంతిస్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. ఉత్తరకొరియాతో చర్చలు నిర్వహించేందుకు డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన విజిలాంట్‌ ఏస్‌ ఎయిర్‌ రక్షణ విన్యాసాలను నిలిపివేసేందుకు మిత్రపక్షాలు అంగీకరించాయని తెలిపారు. కాగా, బుధవారం వాషింగ్‌టన్‌లో జరిగిన రక్షణ మంత్రుల వార్షిక భద్రతా సంప్రదింపుల సమావేశంలో ఈ చర్యలకు మద్దతు ప్రదర్శించినప్పటికి, అణ్వాయుదనిర్మూలన ఒప్పందంలో భాగంగా దేశ భద్రతను, రక్షణ వ్యవస్థను తగ్గిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో వచ్చేవారం ఉత్తరకొరియా అధ్యక్షుడిని కలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తానని తెలిపారు.