కొలిపాక నర్సయ్య ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి

 జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్య ని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి బుధవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వారి వెంట మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్, ముత్తారం బీజేపీ ఇంచార్జ్ పోతరవేని క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు.