కొలువుదీరిన గణనాథుడు..

 

ఇబ్రహీంపట్నం , ఆగష్టు 31 , (జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గణనాధుడు కొలువుదీరాడు. గ్రామాల్లో పిల్లలు ,యువకులు ఉత్సహంగా వినాయకునికి మండపాలు ఏర్పాటు చేసారు.ఉదయం నుండి రాత్రి వరకు వివిధ యూత్ ఉత్స కమిటి , గణేష భజన మండలి సభ్యులు గణనాథుణ్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టాపించారు.వినాయక నవరాత్రి , ఏక దశోత్సవాల్లో భాగంగా వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు.