కోటి నగదు, 2.5 కిలోల గోల్డ్ స్వాధీనం

navi-mumbaiకన్నూర్, డిసెంబర్ 25: ఆధారాలు లేని రూ.51.86 లక్షల నగదును కేరళ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు అంతా రూ.2000 నోట్ల రూపంలోనే ఉంది. బెంగళూరు నుంచి వస్తున్న బస్సును ఇరిట్టి దగ్గర అధికారులు ఆపి ఇద్దరు వ్యక్తుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని గత మూడు రోజుల్లో నగదు పట్టుబడడం ఇది రెండోసారి. డబ్బును తీసుకొస్తున్న వ్యక్తులను రంజిత్ సాలంగి (20), రాహుల్ ఆధిక్ అలియాస్ రాహుల్ (20) ఘటూగా గుర్తించారు. వీరిది మహారాష్ట్ర. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ముంబైలో రూ.35 లక్షలు… 


ముంబై: మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఆరుగురి నుంచి పోలీసులు రూ. 35 లక్షల నగదు, 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో అన్నీ రూ.2000 నోట్లే ఉన్నాయి. దేవ్రం సోలంకి, కుమరం చౌధురి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 2.5 కేజీల బంగారు బిస్కెట్లను తీసుకెళుతున్న వారిని నానాజి మట్కారె, రఘునాథ్ మోహితె, సంతోష్ పవార్, సూర్యకాంత్ కండెగా గుర్తించారు. గోవా ఎయిర్‌పోర్టులో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ. 4.76లక్షల విలువ చేసే రూ. 2000 నోట్లను కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.