కోటి బతుకమ్మ చీరలు పంపిణీ
ఆడపడుచులకు పండుగ కానుక
* వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
జూలూరుపాడు, సెప్టెంబర్ 21, జనంసాక్షి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలు మరింత ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ప్రధానంగా పండుగలను సాంప్రదాయ రీతిన ప్రజలు జరుపుకునేందుకు ప్రభుత్వం తరపున తన వంతు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ముందుకు సాగుతుందని తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయదశమి పర్వదినం వేళ మహిళలు, యువతులు, చిన్నారులు ప్రతి తెలంగాణా పల్లెలో అనాదిగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలను ప్రత్యేకంగా రూపొందించారని తెలిపారు. బతుకమ్మ చీరల ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.339.73 కోట్లు కేటాయించిందని తెలిపారు. బతుకమ్మ పండుగ ఆడపడుచుల్లో సంబరాన్ని నింపుతుందని, పేద, ధనిక తేడా లేకుండా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తారని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెగా అందించటం హర్షనీయమని అన్నారు. తహశీల్దార్ లూధర్ విల్సన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపిపి లావుడ్యా సోని, వైస్ ఎంపిపి నిర్మల, జడ్పీటీసీ కళావతి, ఎంపీడీవో తాళ్లూరి రవి, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, సర్పంచులు గుండెపిన్ని విజయ, గలిగె సావిత్రి, భూక్యా పద్మ, లక్ష్మి, బానోతు నరసింహారావు, శాంతిలాల్, శాంతిరాం, బోజ్యా, కిషన్ లాల్, ఎంపిటిసిలు పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరి మధుసూదనరావు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ యదళ్లపల్లి వీరభద్రం, పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, వేల్పుల నరసింహారావు, లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, నర్వనేని పుల్లారావు, చాపలమడుగు రామ్మూర్తి, మోదుగు రామకృష్ణ, పోతురాజు నాగరాజు, బుడిపుడి ప్రభాకర్, రామిశెట్టి నాగేశ్వరరావు, సుభాని, పణితి వెంకటేశ్వర్లు, మాడుగుల నాగరాజు, మహబూబ్, కిరణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.